జమ్ము కశ్మీర్‌లో ఒకే జిల్లాలో రెండు చోట్ల అరగంట తేడాతో రెండు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఈ రెండు ఘటనల్లోనూ ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. ఇందులో నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ అఫాక్ సికందర్ మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. 

శ్రీనగర్: Jammu kashmirలో మరోసారి కాల్పులు మోత మోగింది. దక్షిణ కశ్మీర్ జిల్లా Kulgamలో అరగంట తేడాతో రెండు Encounterలు చోటుచేసుకున్నాయి. ఇందులో మొత్తం ఐదుగురు Terrorists హతమయ్యారు. మృతుల్లో ఓ ఉగ్రవాద సంస్థ కమాండర్ కూడా ఉన్నట్టు కశ్మీర్ జోన్ పోలీసు వెల్లడించింది. కుల్గాం జిల్లాలోని పొంబే ఏరియాలో ఈ రోజు ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోంబే ఏరియాలో ఎన్‌కౌంటర్ మొదలైన అర గంట లోపే గోపాల్‌పొరాలోనూ మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

గోపాల్‌పొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. గోపాల్‌పొరాలో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా వర్గాల చేతిలో హతమయ్యారు. గోపాల్‌పొరాలో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్ అఫాక్ సికందర్ కూడా ఉన్నట్టు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(కశ్మీర్) విజయ్ కుమార్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు.

Scroll to load tweet…

Also Read:ఉగ్రవాదం పెరిగింది.. జమ్ము కశ్మీర్‌కు వెళ్లొద్దు.. పౌరులకు అమెరికా ప్రభుత్వం సూచనలు

పోంబే ఏరియా, గోపాల్‌పొరా ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు భద్రతా బలగాలకు సమాచరం అందింది. దీంతో భారత ఆర్మీ సహా స్థానిక పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌కు వెళ్లాయి. ఈ రెండు ఏరియాల్లోనూ కార్డన్ సెర్చ్ చేస్తుండగా అక్కడి నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఉగ్రవాదులకు వచ్చింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పులను తిప్పి కొట్టడానికి భద్రతా బలగాలూ ఎదురు కాల్పులు జరిపాయని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

జమ్ము కశ్మీర్‌లో రక్తపాతం పారుతున్నది. అటు భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. మరోవైపు సాధారణ పౌరుల ప్రాణాలూ ఉగ్రవాదుల తూటాలకు బలైపోతున్నాయి. ఇటీవలే శ్రీనగర్‌లోని ఈద్గా ఏరియాలో చాట్ అమ్ముకునే ఓ బిహారీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కార్పెంటర్‌పైనా కాల్పులు జరిపారు. ఇందులో బిహార్‌కు చెందిన ఆ వీధివ్యాపారి మరణించాడు.

Also Read: పెద్ద శత్రువు పాక్ కాదు, చైనానే.. మనకు అమెరికా, రష్యా రెండూ కావాలి.. సీడీఎస్ బిపిన్ రావత్

శ్రీనగర్, పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు నాన్ లోకల్ లేబర్ల‌పై కాల్పులు జరిపారని జమ్ము కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇందులో బిహార్‌లోని బంకాకు చెందిన అరవింద్ కుమార్ షా శ్రీనగర్‌లో తూటాలు తగిలి మరణించారని వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాగిర్ అహ్మద్‌ పుల్వామాలో ఉగ్రవాదుల కాల్పులకు గురై గాయపడ్డారని తెలిపారు. ఈ రెండు ప్రాంతాలను సీజ్ చేసి ఉగ్రవాదుల కోసం గాలింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

అరవింద్ కుమార్ షాను పాయింట్ బ్లాంక్ రేంజ్‌ నుంచి ఉగ్రవాదులు కాల్చి చంపినట్టు కొన్నివర్గాలు తెలిపాయి. అరవింద్‌ను హాస్పిటల్‌కు తరలించగానే అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు చెప్పారు.