Asianet News TeluguAsianet News Telugu

ఉగ్రవాదం పెరిగింది.. జమ్ము కశ్మీర్‌కు వెళ్లొద్దు.. పౌరులకు అమెరికా ప్రభుత్వం సూచనలు

జమ్ము కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించినప్పటి నుంచి పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయని అమెరికా తెలిపింది. భారత్, పాకిస్తాన్ వెళ్లే అమెరికా పౌరులు కచ్చితంగా కొన్ని ముందుజాగ్రత్తలు పాటించాలని అమెరికా సోమవారం కొన్ని సూచనలు విడుదల చేసింది. ఉగ్రవాదం, ఉద్రిక్తతలు పెరిగినందున జమ్ము కశ్మీర్‌కు వెళ్లకపోవడమే మంచిదని పౌరులకు సూచనలు చేసింది.
 

america directs its citizens to do not go jammu kashmir
Author
New Delhi, First Published Nov 17, 2021, 7:41 PM IST

న్యూఢిల్లీ: India, Pakistanలలో Terrorism, నేరాలు పెరిగాయని America ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే ఆ దేశ పౌరులు.. భారత్, పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. ప్రత్యేకంగా కొన్ని సూచనలు చేసింది. భారత్‌కు వెళ్లిన అమెరికా పౌరులు Jammu Kashmir వెళ్లడంపై పునరాలోచించుకోవాలని సూచనలు చేసింది. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదం, ఉద్రిక్తతలు ఉన్నాయని వివరించింది. కాబట్టి పౌరులు జమ్ము కశ్మీర్‌కు వెళ్లవద్దని సూచించింది. కాగా, పాకిస్తాన్ వెళ్లే అమెరికా పౌరులు బలోచిస్తాన్, ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్‌లకు వెళ్లడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

అమెరికా ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ఆ సూచనల ప్రకారం, అమెరికా పౌరులు జమ్ము కశ్మీర్ వెళ్లవద్దు అని సూచించింది. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదం, ఉద్రిక్తతలు పెరిగాయని తెలిపింది. అంతేకాదు, ఇండియా పాకిస్తాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల కంటే సమీపంగా వెళ్లవద్దని వివరించింది. ఎందుకంటే అక్కడ ఎప్పుడైనా కాల్పులు, పేలుళ్లు జరిగే ముప్పు ఉన్నదని తెలిపింది. భారత్‌లో లైంగికదాడుల నేరాలు వేగంగా పెరుగుతున్నాయని ఆ దేశ అధికారిక నివేదికలు చెబుతున్నాయని పేర్కొంది. టూరిస్టు ప్రాంతాలు సహా ఇతర చోట్లా లైంగిక దాడులు జరిగే ముప్పు ఎక్కువ అని వివరించింది. టూరిస్టు లొకేషన్లు, రవాణా ప్రాంతాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ వసతులు ఉండే ప్రాంతాల్లో ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే తీవ్రవాదుల దాడులు జరిగే అవకాశముందని తెలిపింది. భారత్‌లోనూ కొన్ని మారుమూల ప్రాంతాల్లో పౌరులకు భద్రత కల్పించడం ప్రయాసతో కూడుకున్న పని అని వివరించింది. తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ పశ్చిమ భాగం వరకు ఈ ప్రాంతాల్లో ప్రయాణించాలంటే ముందస్తుగా
అనుమతులు తీసుకుని, ముందుగానే సమాచారం ఇవ్వాలని తెలిపింది. అలాగైతే, వారికి ఏ ప్రమాదం ఎదురైనా కాపాడటానికి, భద్రత కల్పించడానికి అవకాశం ఉంటుందని వివరించింది.

Also Read: ఐరాసలో పాక్ మీద ధ్వజమెత్తిన భారత్... ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి వెంటనే వెనక్కి వెళ్లాలని హెచ్చరిక..

పాకిస్తాన్‌లోనూ ఉగ్రవాదం పెల్లుబుకుతున్నదని అమెరికా ప్రభుత్వం దాని పౌరులకు తెలిపింది. పాకిస్తాన్‌లో ఎప్పుడూ దాడులు చేయడానికి కుట్రలు జరుగుతూనే ఉంటాయని వివరించింది. స్థానిక మిలిటరీ, పోలీసులు, పౌరులపైనా టెర్రరిస్టుల దాడులు జరుగే ముప్పు ఉందని తెలిపింది. అమెరికా దౌత్యవేత్తలు, దౌత్య వసతులపైనా పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు దాడి చేసిన ఉదంతాలు ఉన్నాయని పేర్కొంది.

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే చట్టాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు మారాయని అమెరికా తెలిపింది. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందని పేర్కొంది. అనంతరం ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషనర్‌ను వెనక్కి పంపిందనీ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios