Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై బదిలీ వేటు

ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై ఆ సంస్థ బదిలీ వేటు వేసింది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్‌ నియమించనున్నట్లు తెలుస్తోంది.

Twitter India Head Manish Maheshwari Gets New US Based Role
Author
New Delhi, First Published Aug 13, 2021, 6:21 PM IST


ట్విట్టర్ ఇండియా ఎండీపై ఆ సంస్థ బదిలీ వేటు వేసింది. ఇండియా బాధ్యతలు చూస్తోన్న మనీష్ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేస్తూ ట్విట్టర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కేంద్రం నుంచి ట్విట్టర్ ఫిర్యాదులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ ఖాతాలను సైతం బ్లాక్ చేయడంతో ఆ సంస్థపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మనీశ్ మహేశ్వరి బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్‌ నియమించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:ట్విట్టర్ ఇండియా ఎండీకి కోర్టులో ఊరట.. పోలీసులు ఇచ్చిన నోటీసు కొట్టివేత

గత ఏడాది కాలంగా ఇండియాలో ట్విట్టర్‌కి కలిసి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కొంత కాలం గళం విప్పింది ట్విటర్‌. గ్రీవెన్స్‌ అధికారిగా భారతీయుడినే నియమించాలనే నిబంధన అమలు చేసేందుకు మీన మేషాలు లెక్కించింది. దీంతో భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. దీంతో ఎట్టకేలకు భారతీయుడినే గ్రీవెన్స్‌ అధికారిగా నియమించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios