Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ ఇండియా ఎండీకి కోర్టులో ఊరట.. పోలీసులు ఇచ్చిన నోటీసు కొట్టివేత

ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌ మనీష్ మహేశ్వరికి కోర్టులో ఊరట లభించింది. హేశ్వరికి ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీ చేసిన నోటీసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఐపీసీలోని సెక్షన్ 41ఏ కింద యూపీ పోలీసులు మనీష్ మహేశ్వరికి ఇటీవల నోటీసు ఇచ్చారు.

karnataka hc quashes up police notice to twitter india md ksp
Author
Bangalore, First Published Jul 23, 2021, 6:29 PM IST

ఘజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్‌లో పోస్ట్ కావడంపై ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌ మనీష్ మహేశ్వరికి ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీ చేసిన నోటీసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఐపీసీలోని సెక్షన్ 41ఏ కింద యూపీ పోలీసులు మనీష్ మహేశ్వరికి ఇటీవల నోటీసు ఇచ్చారు. అయితే దానిని కర్ణాటక హైకోర్టులో ఆయన సవాలు చేశారు.

యూపీ పోలీసుల నోటీసును ''వేధింపుల సాధనంగా'' ముంబై హైకోర్టు పేర్కొంటూ ఆ నోటీసును శుక్రవారంనాడు తోసిపుచ్చింది. ట్విట్టర్‌లో పోస్టయిన సమాచారంపై ట్విట్టర్ ఇండియా కమ్యూనికేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (టీసీఐపీఎల్) ఎండీకి అదుపు చేసే అవకాశం ఉందా లేదా అనేది అంచనా వేయకుండా నోటీసు పంపడాన్ని కోర్టు నిలదీసింది. అయితే ట్విట్టర్ ఎండీ కార్యాలయం, లేదా ఇంటికి వెళ్లడం ద్వారా కానీ, వర్చువల్ తరహాలో కానీ ఆయన స్టేట్‌మెంట్ తీసుకోవడానికి పోలీసులను కోర్టు అనుమతించింది

Follow Us:
Download App:
  • android
  • ios