కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను శనివారం విడుదల చేసింది. ఇందులో 43 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే కోలార్ స్థానాన్ని ఆశిస్తున్న మాజీ సీఎం సిద్ధరామయ్యకు ఆ టికెట్ కేటాయించలేదు. 

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం 43 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను కాంగ్రెస్ శనివారం ప్రకటించింది. ఇందులో అనేక మంది కీలక నేతల పేర్లు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఒకరోజు ముందు కాంగ్రెస్‌లో చేరిన రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడికి అథని స్థానం నుంచి టికెట్ లభించింది. అయితే ఎంతో కాలం నుంచి కోలార్ సీటు ఆశిస్తున్న కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు భంగపాటు ఎదురయ్యింది. ఆ స్థానాన్ని అధిష్టానం కొత్తూర్ జి మంజునాథ్ కు కేటాయించింది.

బాబోయ్.. మళ్లీ 10 వేలు దాటిక కరోనా కొత్త కేసులు..పెరిగిన మృతుల సంఖ్య..

జనతా దళ్ (సెక్యులర్)ను వీడి కాంగ్రెస్ లో చేరిన శివలింగే గౌడ 2023 కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన 43 మంది అభ్యర్థుల మూడో జాబితాలో చోటు దక్కించుకున్నారు. అలాగే మోటమ్మ కుమార్తె నయనకు కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కింది. మార్గరెట్ ఆల్వా కుమారుడు నివేదిత్ అల్వాకు టికెట్ కేటాయించింది. 

కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి, 12 మంది పరిస్థితి విషమం.. బీహార్ లో ఘటన

కాగా.. వరుణ స్థానం నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్య పోటీ చేయనున్నారు. అయితే ఆయన కోలార్ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని కొంత కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ కోరికను పార్టీ హైకమాండ్ వద్ద కూడా వ్యక్తం చేశారు. కానీ ‘ఒక అభ్యర్థికి ఒకే స్థానం’ నిబంధనను పాటిస్తున్న కాంగ్రెస్.. మాజీ సీఎం విషయంలోనూ దానినే పాటించింది. మూడో జాబితాలో కోలార్ టికెట్ తనకు వస్తుందని ఆయన ఆశతో ఎదురుచూశారు. కానీ కొత్తూరి మంజునాథ్‌ను పార్టీ పోటీకి దిపింది. 

Scroll to load tweet…

ఇదిలా ఉండగా.. బెంగళూరు సౌత్ నుంచి ఆర్కే రమేష్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. షిమోగా రూరల్‌ స్థానం నుంచి శ్రీనివాస్‌ కరియాణ, శివమొగ్గ నుంచి హెచ్‌సీ యోగేశ్‌, బళ్లారి నుంచి నారా భరత్ రెడ్డికి పార్టీ టిక్కెట్టు ఇచ్చింది. చిక్కబళ్లాపూర్‌ నుంచి ప్రదీప్‌ ఈశ్వర్‌ అయ్యర్‌, హసన్‌ నుంచి బనవాసి రంగస్వామికి టెక్కెట్లు కేటాయించింది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటివరకు 209 మంది అభ్యర్థులను ప్రకటించింది. మార్చి 25న 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది. 42 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ఏప్రిల్ 6న విడుదల చేసింది. ఇంకా 15 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న జరగనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం మే 13న విడుదల చేయనుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ నేత కాళ్లను తాకిన యడియూరప్ప కుమారుడు.. వీడియో వైరల్

ఏప్రిల్ 12వ తేదీన బీజేపీ 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. జనతాదళ్ (ఎస్) కూడా ఇప్పటి వరకు తన అభ్యర్థుల రెండు జాబితాలను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లోనే 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేయగా.. 
శుక్రవారం రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 50 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.