Parliament Security Breach : నేనే ఫస్ట్ రిపోర్ట్ చేస్తా.. దుండగులు తెచ్చిన పొగ డబ్బా కోసం జర్నలిస్టుల కుస్తీ

పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. లోక్‌సభలో నిరసనకారులు ఉపయోగించిన పొగ డబ్బాను పట్టుకోవడానికి టీవీ రిపోర్టర్లు తమలో తాము పోరాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

TV Reporters FIGHT Among Themselves To Get Hold Of Smoke Canister That Protestors Used In Lok Sabha, Watch Viral Video ksp

భారత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటి పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు పూర్తయిన రోజే.. మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. బుధవారం లోక్‌సభలో ఇద్దరు దుండగులు గందరగోళం సృష్టించారు. ఓ వ్యక్తి విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూసుకెళ్లగా.. మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలాడు. లోక్‌సభలోకి దూకిన వ్యక్తి .. ఎంపీలు కూర్చొనే టేబుళ్లపైకి ఎక్కి నల్ల చల్లాలను బంద్ చేయాలంటూ నినాదాలు చేశాడు.  చర్చా కార్యాక్రమంలో వున్న వేళ పొగ రావడంతో లోపల ఏం జరుగుతుందో అర్ధం కాక ఎంపీలు వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. 

 

 

మరోవైపు.. లోక్‌సభలో నిరసనకారులు ఉపయోగించిన పొగ డబ్బాను పట్టుకోవడానికి టీవీ రిపోర్టర్లు తమలో తాము పోరాడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జర్నలిస్టులు ఒకరి నుంచి మరొకరు పొగ డబ్బా లాక్కోవడానికి యత్నించారు. ఈ తతంగమంతా కెమెరాల్లో రికార్డ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మీడియా ప్రతినిధులు ఒకరినొకరు తోసుకుంటూ ఆ డబ్బాను లాక్కోవడానికి యుద్ధం చేశారు. ఎట్టకేలకు ఓ జర్నలిస్ట్ ఆ పొగ డబ్బా సంపాదించి .. పార్లమెంట్‌లో దుండగులు స్మోక్ స్ప్రే చేసింది దీనితోనే అని రిపోర్టింగ్ చేస్తున్నారు. ఇంతలో ఓ మహిళ సహా మరో ఇద్దరు జర్నలిస్టులు ఆ పొగ డబ్బాను, మైక్‌ను లాక్కోవడానికి యత్నించారు. 

 

 

ఈ వీడియోను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో జర్నలిస్టులపై పంచులు వేస్తున్నారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యానికి సాక్ష్యంగా వున్న స్మోక్ డబ్బాను అలా చేస్తున్నారేంటీ.. దీనిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపాలి కదా అని యశ్వీర్ సింగ్ సంధు అనే వ్యక్తి కామెంట్ చేశాడు. మరో వ్యక్తి అయితే వీడియోలో కనిపిస్తున్న వారు తమను తాము జర్నలిస్టులమని మరిచిపోయినట్లున్నారని పంచ్ విసిరారు. 

 

 

కాగా.. భ‌ద్ర‌తా ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన ఇద్ద‌రిని అక్క‌డ సెక్యూరిటీ ప‌ట్టుకుంది. ఆ ఇద్ద‌రు దుండ‌గుల‌ను సాగ‌ర్ శ‌ర్మ‌, మ‌నోరంజ‌న్ డి గా గుర్తించారు. అధికారులు వారి వివ‌రాలు వెల్ల‌డిస్తూ.. నిందితులు మైసూర్‌-కొడగు ఎంపీ ప్రతాప్‌ సింహ ద్వారా పార్ల‌మెంట్ లోకి ప్ర‌వేశించ‌డానికి పాస్ లు పొందార‌ని స‌మాచారం. నిందితుల‌ను శంకర్ లాల్ శర్మ కుమారుడు సాగర్ శర్మ, డి దేవరాజ్ కుమారుడు డి మనోరంజన్ (35)గా గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పార్లమెంటు వెలుపల అదుపులోకి తీసుకున్న మ‌రో ఇద్దరిని నీలం అనే 42 ఏళ్ల మహిళ, 25 ఏండ్ల‌ అమోల్ షిండేగా గుర్తించారు. దుండగుల గురించి పోలీసు వర్గాలు పరిమిత సమాచారాన్ని విడుదల చేశాయి. అయితే, మనోరంజన్ మైసూరుకు చెందినవాడనీ, మైసూర్ వివేక‌నంద యూనివ‌ర్సీటి లో కంప్యూటర్ సైన్సెస్ లో గ్రాడ్యుయేట్ అని స‌మాచారం.

 

 

పార్లమెంటు వెలుపల అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు హర్యానాలోని హిసార్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఈ నలుగురిని అరెస్టు చేశామనీ, ఢిల్లీ పోలీసుల యాంటీ టెర్రర్ సెల్ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తోందన్నారు. పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సహా ఉన్నతాధికారులు పార్లమెంటులో ఉన్నారు. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios