సత్యమే నా ఆయుధం: గుజరాత్ కోర్టులో ఊరట తర్వాత రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే

గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 12వ తేదీ వరకు బెయిల్ ఇచ్చిన కోర్టు.. 13వ తేదీన సూరత్ కోర్టు తీర్పుపై అప్పీల్‌ను విచారించనుంది. బెయిల్ తర్వాత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు.
 

truth is my weapon and refuge says rahul gandhi after gujarat court grats bail in modi surname case kms

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి ఈ రోజు గుజరాత్ కోర్టులో ఉపశమనం లభించింది. అనంతరం ఆయన హిందీలో ఓ ట్వీట్ చేశారు. సత్యమే తన ఆయుధమని వివరించారు. తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాటం చేస్తున్నానని తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే పోరాటం ఇది. మిత్రకాలానికి విరుద్ధంగా చేస్తున్న పోరాటం. ఈ యుద్ధంలో సత్యమే నా ఆయుధం. సత్యమే నా ఆశ్రయం’ అని వివరించారు. 

మోడీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ 2019లో కర్ణాటకలోని కోలార్‌లో చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ.. రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేశారు. ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారించి సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక నెల రోజులపాటు శిక్షను రద్దు చేసి.. తీర్పును పైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.

తాజాగా, సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ స్వీకరించిన కోర్టు.. రాహుల్ గాంధీకి ఈ నెల 12వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్ల  జైలు శిక్షపై స్టే విదించింది. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తు దాఖలైన ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 13వ తేదీన విచారంచనుంది.

Also Read: రెండు పెళ్లిళ్లు చేసుకుంటా... మ్యారేజ్ చేసుకున్న వెంటనే లవర్‌ను పెళ్లి చేసుకుంటానని వధువు డిమాండ్.. (వీడియో)

సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. సూరత్ కోర్టు శిక్షను రివర్స్ చేయకుంటే.. ఆయన అనర్హుడిగానే ఉంటారు. తద్వార వచ్చే ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు. 

ఈ అనర్హత వేటు తర్వాత ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి నోటీసులు వచ్చాయి. ఈ నోటీసులకు ఆయన సానుకూలంగా స్పందించారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తానని చెప్పారు. త్వరలోనే ఆయన బంగ్లాను ఖాళీ చేయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios