రెండు పెళ్లిళ్లు చేసుకుంటా... మ్యారేజ్ చేసుకున్న వెంటనే లవర్‌ను పెళ్లి చేసుకుంటానని వధువు డిమాండ్.. (వీడియో)
ఓ నూతన వధువు పెళ్లయిన వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి వీరంగం సృష్టించింది. ఆ పెళ్లి తర్వాత వెంటనే తన లవర్‌ను పెళ్లి చేసుకుంటానని, రెండు పెళ్లిళ్లు చేసుకుంటానని కేకలు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
న్యూఢిల్లీ: అప్పుడే పెళ్లి చేసుకుంది. మళ్లీ పెళ్లి చేసుకుంటాను అన్నది. వరుడు, వధువు కుటుంబాలు సహా అతిథులూ ఖంగుతిన్నారు. పెళ్లి చేసుకున్న వెంటనే ఆ నూతన వధువు పోలీసుల వద్దకు వచ్చింది. ఇప్పుడు తన లవర్‌ను పెళ్లి చేసుకుంటానని డిమాండ్ చేసింది. తాను రెండు పెళ్లిళ్లు చేసుకుంటానని హల్‌చల్ చేసింది. ఆమె తీరుతో పోలీసులు నోరు వెళ్లబెట్టారు. ఇద్దరు మహిళా పోలీసు అధికారులు ఆమెను నియంత్రించే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.
ఆ వధువు ఎవరితోనో గొడవ పడుతున్నట్టుగా ఆ వీడియోలో కనిపిస్తున్నది. ఇద్దరు లేడీ ఆఫీసర్లు ఆమెను పట్టుకున్నారు. అయినా, ఆమె ఆగకపోవడంతో నేలపై పడేసే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆమె ఫోన్‌ను నేలకేసి కొట్టింది. కిందపడ్డ తర్వాత కొంత నెమ్మదించినా మళ్లీ పైకి లేచి గందరగోళం చేసింది. రెండు పెళ్లిళ్లు చేసుకుంటానని వీరంగం సృష్టించింది. ఆమెను అక్కడి నుంచి ఓ లేడీ ఆఫీసర్ తీసుకెళ్లే వరకు ఆ వీడియో ఉన్నది.
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ వధువుకు బలవంతపు పెళ్లి చేసినట్టుగా కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. అందుకే పెళ్లయిన తర్వాత ఆమె తన లవర్‌ను పెళ్లి చేసుకుంటానని ఈ దుమారం రేపి ఉంటుందని అంచనాకు వచ్చారు. కాగా, కొందరు ఆమె ప్రవర్తనను ఖండించారు.
వధువు లేదా వరుడుకు ఇష్టం లేకుండా తాము చూసిన సంబంధాన్నే అంగీకరించాలని పెద్దలు ఎందుకు డిమాండ్ చేస్తారో అర్థం కాదని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. తద్వారా వధువు, వరుడు, మాజీ లవర్ కుటుంబాలకు తలనొప్పిగా మారుతుందని వివరించాడు. మరొకరు ఇది బాధాకరమైన ఘటన అని, ఆమెకు ఎందుకు బలవంతపు పెళ్లి చేశారో తెలియదు అని పేర్కొన్నాడు.
Also Read: అంబానీ పార్టీలో ఫుడ్‌తో టిష్యూకు బదులు కరెన్సీ నోట్లు? ఆ వైరల్ ట్వీట్ ఏం చెబుతున్నదంటే?
ఇంకొకరు ఈ డ్రామా అంతా పెళ్లికి ముందు చేయాల్సింది అని అభిప్రాయపడ్డాడు. మరొకరు వరుడికి ఏ ప్రమేయం లేకున్నా ఈ అవమాన భారాన్ని మోయాల్సి వస్తుందని తెలిపాడు. వారు పెళ్లి కూతురు కుటుంబంపై ఫ్రాడ్ కేసు పెట్టాలని ఆగ్రహించాడు.