ఆగివున్న బస్సును ఢీకొన్న ట్రక్కు, 11 మంది దుర్మరణం, ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
రాజస్తాన్‌లో నేషనల్ హైవేపై సాంకేతిక సమస్యతో ఆగిపోయిన బస్సును వేగంగా వస్తున్న ఓ ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆ బస్సులోని 11 మంది ప్రయాణికులు మరణిచారు. ఈ ఘటన భరత్ పూర్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు చోటుచేసుకుంది.
జైపూర్: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి వున్న బస్సును ఓ ట్రక్కు వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 11 మంది మరణించారు. ఇందులో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ఎక్స్‌లో ప్రకటించింది.
Also Read: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. సైనికుడిని కాపాడుతూ, కాల్పులకు గురై ఆరేళ్ల ఆర్మీ కుక్క మృతి
ప్రయాణికులతో నిండిన ఓ బస్సు గుజరాత్ నుంచి మాథురాకు వెళ్లుతున్నది. ఆ బస్సు రాజస్తాన్‌లో భరత్ పూర్ జిల్లా పరిధిలో జైపూర్ - ఆగ్రా జాతీయ రహదారిపై నిలిచిపోయింది. సాంకేతిక సమస్యతో ఆ బస్సు రోడ్డుపైనే ఆగిపోయింది. అదే దారిలో వస్తున్న ఓ ట్రక్కు వేగంగా వెనుక నుంచి ఆ బస్సును ఢీకొంది. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో బస్సులోని 11 మంది ప్రయాణికులు మరణించారు. ఇందులో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నట్టు పీటీఐ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.