60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 28.13 లక్షల మంది ఓటర్లు 259 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మార్చి 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 60 మంది సభ్యులున్న శాసనసభకు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈశాన్య-రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్-వామపక్ష కూటమి, ప్రాంతీయ పార్టీ అయిన తిప్ర మోత మధ్య త్రిముఖ పోరు జరుగుతోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కూడా రాష్ట్రంలో ఎన్నికల అదృష్టాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది.
విషాదం.. అగ్గిపెట్టెతో ఆట.. ప్రమాదవశాత్తు నిప్పంటించుకుని బాలుడు మృతి..
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో 1,100 సెన్సిటివ్‌గా, 28 క్రిటికల్‌గా బూత్ లుగా గుర్తించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 28.13 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 13.53 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 28.13 లక్షల మంది ఓటర్లు 259 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) గిత్తె కిరణ్‌కుమార్ దినకర్రో తెలిపారు.
ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న 60 అసెంబ్లీ స్థానాల్లో 20 రాష్ట్రంలోని 19 షెడ్యూల్డ్ తెగలకు, 10 షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. ప్రస్తుత మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)తో కలిసి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ 55 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఐపీఎఫ్ టీ మిగిలిన ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది.
'ఇది వ్యక్తిగత జీవితాల్లో విధ్వంసం' బాల్య వివాహాలపై గౌహతి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ఒప్పందం కుదుర్చుకున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 47 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌కు 13 సీట్లు కేటాయించారు. త్రిపుర రాజ వంశస్థుడు ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దెబ్బర్మ నేతృత్వంలోని కొత్త గిరిజన పార్టీ టిప్రా మోతా 42 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ 28 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.
