Asianet News TeluguAsianet News Telugu

శవంతో 600 కిలోమీటర్లు ప్రయాణం.. రైలులో ప్యాసింజర్లకు భయానక అనుభవం.. ఎక్కడంటే...

తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న రైలు జనరల్ కోచ్‌లో ఒక వ్యక్తి మరణించడంతో మృతదేహంతో పాటు సుమారు 600 కి.మీ. ప్రయాణించారు.

Traveling 600 kilometers with a dead body, A terrifying experience for passengers in the train In tamilnadu - bsb
Author
First Published Nov 8, 2023, 2:07 PM IST

తమిళనాడు : తమిళనాడులోని ఓ రైలులో వెలుగు చూసిన ఘటన షాకింగ్ కు గురి చేసింది. మృతదేహంతో పాటు ప్రయాణికులు 600 కి.మీ.లు బలవంతంగా ప్రయాణించాల్సి వచ్చింది. అసలే మన దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ. మనిషి చనిపోతే అప్పటివరకు ఉన్న విలువ మాయమై.. ఆ చోట భయం నెలకొంటుంది. అలాంటింది... మృతదేహం ఉందని తెలిసీ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ ప్రయాణం కొనసాగించారు ఆ రైలులో ప్రయాణికులు. 

దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే... సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు జనరల్ కోచ్‌లో లో ప్రయాణిస్తున్న ప్రయాణికులలో ఒక వ్యక్తి మరణించాడు. ఈ విషయం తెలిసినా.. మృతదేహంతో పాటు సుమారు 600 కి.మీ. రైలు చెన్నై నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్లింది. ప్రయాణీకులు రైల్వే అధికారులకు అనేక హెచ్చరికలు చేసినప్పటికీ, వారు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చేరుకునే వరకు మృతదేహాన్ని తొలగించలేదు. ఝాన్సీకి చేరుకున్న తరువాత ప్రభుత్వ రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం పంపారు.

ఎలుకను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడా? ఎందుకో తెలుసా?...

ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందిన రామ్‌జీత్ యాదవ్ (36) అనే వ్యక్తి చెన్నైలో పనిచేసేవాడు. అతను అనారోగ్యంతో ఉన్నాడు. తన బావ గోవర్ధన్‌తో కలిసి బందాకు తిరిగి వెళ్తున్నాడు. ఆదివారం, రైలు నాగ్‌పూర్‌కు చేరుకున్నప్పుడు రామ్‌జీత్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో అతను మరణించాడు. 

ఇది గమనించిన గోవర్థన్ సహాయం కోసం ప్రయత్నించాడు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బోగీలోని ప్రయాణీకులు రామ్‌జీత్ మృతదేహంతో పాటు ప్రయాణానించాల్సి వచ్చింది. ఉదయం రైలు భోపాల్‌కు చేరుకోగానే ప్రయాణికులు మళ్లీ రైల్వే అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఝాన్సీ వద్దకు చేరుకున్న తరువాత కానీ మృతదేహాన్ని బయటకు తీయలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios