Asianet News TeluguAsianet News Telugu

ఎలుకను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడా? ఎందుకో తెలుసా?...

పోలీస్ స్టేషన్ లోని బోనులో ఓ ఎలుక బిక్కుబిక్కుమంటూ కనిపించింది. ఆరాతీస్తే ఓ కేసులో నిందితురాలిగా దాన్ని అరెస్ట్ చేసినట్లు తేలింది. 

police arrested rat for destroying seized liquor in Rat Madhya Pradesh - bsb
Author
First Published Nov 8, 2023, 1:09 PM IST

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్ లోని చింద్వారాలోని ఒక విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. దీని గురించి విన్న వారంతా.. వార్నీ అని ఆశ్చర్యపోతూ.. ముక్కున వేలేసుకున్నారు. పోలీసులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అంటూ గుసగుసలాడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. చింద్వారాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొంత మద్యాన్ని సీజ్ చేసి తీసుకొచ్చి పెట్టారు. ఈ  మద్యాన్ని ఎలుకలు తాగేశాయని ఆరోపిస్తూ, ఓ ఎలుకను బోనులో బంధించారు.

కనీసం ఐదు డజన్ల (60 సీసాలు) మద్యాన్ని తాగేశాయని పోలీసులు చెప్పారు. అంతేకాదు ఎలుకలు "మద్యం తాగడం" ఆనందిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలా ఎలుకను అరెస్టు అనడం... ఇప్పటికే ఉన్న చట్టపరమైన కేసుకు ఒక విచిత్రమైన మలుపు నిచ్చింది. పోలీసులు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్న వ్యక్తి కూడా ఈ కేసులో ఉన్నాడు.  సాక్ష్యాధారాలు ధ్వంసం కావడంతో పోలీసులు కోర్టులో పరిస్థితిని వివరించడం సమస్యాత్మకంగా మారింది. పోలీసులు కోర్టులో మద్యానికి సంబంధించి రుజువులు, స్వాధీనం చేసుకున్న మెటీరియల్ చూపించవలసి ఉంటుంది, ఇది వారికి పెద్ద సవాలుగా రుజువు చేస్తుంది.

దేశవ్యాప్తంగా కలకలం రేపి నోట్ల రద్దుకు ఏడేళ్లు.. ఫలితం దక్కిందా ?

కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లోనే కాకుండా చింద్వారాలోని ఇతర ప్రభుత్వ సంస్థల వద్ద కూడా ఎలుకలు బీభత్సం సృష్టించాయి. జిల్లా ఆస్పత్రి, కలెక్టరేట్‌, విద్యాశాఖ కార్యాలయాల్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎలుకలు ముఖ్యమైన కాగితాలను,  అప్పుడప్పుడు మృతదేహాలను కూడా తింటున్నాయి. ఎలుకల బెడద లేకుండా చేసేందుకు ఆస్పత్రిలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఎలుకల నివారణకు కృషి చేసినా ఫలితం లేదు.

ఇప్పటి వరకు, కొత్వాలి పోలీసులు ఉచ్చు బిగించి ఒక ఎలుకను పట్టుకోగలిగారు. మిగిలినవి స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం రాజస్థాన్‌లో, జోధ్‌పూర్‌లోని ఎండీఎం హాస్పిటల్‌లోని సైకియాట్రీ విభాగంలో రోగుల పాదాలను ఎలుకలు కొరుకుతున్నాయని నలుగురు మానసిక రోగుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం సూచించింది.

జోధ్‌పూర్ డివిజన్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎండీఎం ఆసుపత్రి, ఎలుకలకు నిలయంగా మారింది, నిర్మాణ పనులు, నేలపై ఉన్న ఆహార వ్యర్థాలు ఎలుకలకు అనుకూలంగా మారాయి. 
అపరిశుభ్ర పరిస్థితులు, బహిరంగ గుంతలు, క్రేటర్ల కారణంగా ఆస్పత్రిలో ఎలుకల బెడద గణనీయంగా పెరిగినా పెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios