లైఫ్ గార్డులు హెచ్చరిస్తున్న ఐదుగురు బాలురు సముద్రంలోకి దూకారు. బిపార్జోయ్ తుఫాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. దీంతో ఆ నీటిలో మునిగిపోవడంతో నలుగురు చనిపోయారు. ఒకరిని సిబ్బంది రక్షించారు. 

ముంబైలోని జుహు బీచ్ లో లైఫ్ గార్డ్ ను పట్టించుకోకుండా సముద్రంలోకి దూకిన ఐదుగురు బాలుర కథ విషాదంతం అయ్యింది. ఇందులో నలుగురు బాలురు సముద్రపు నీటిలో మునిగి చనిపోయారు. అయితే అందులో ఒక బాలుడిని సిబ్బంది రక్షించారు. గల్లంతైన మరో నలుగురు బాలుర కోసం ఐదు గంటల పాటు గాలించారు. కానీ వారి ఆచూకీ లభ్యం కాలేదు.

ఒడిశా రైలు ప్రమాదంపై త్వరలో నివేదిక..! ఐదుగురు కేంద్రంగా కొనసాగుతున్న విచారణ..!

ఎనిమిది పిల్లల బృందంలో పిక్నిక్ కోసం జుహు బీచ్ కు వెళ్లారని పోలీసులు తెలిపారు. అయితే వారిలో ముగ్గురు సముద్రం సరిహద్దునే ఉన్నారని, మిగితా ఐదుగురు మాత్రం సముద్రంలోకి దూకారని చెప్పారు. కాగా... బిపార్జోయ్ తుఫాను నేపథ్యంలో ప్రజల సందర్శన కోసం జుహు బీచ్ ను మూసివేశారని సమాచారం. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు తీరప్రాంతాలను మూసివేశారు.

దళిత వివాహితతో ముస్లిం యువకుడి ఫేస్ బుక్ స్నేహం.. నమ్మించి, మతం మార్చి పెళ్లి.. తరువాత..

సముద్ర తీరం మూసివేసినప్పటికీ ఈ బాలురు సాయంత్రం 4.30 నుంచి 5 గంటల మధ్య జుహు కోలివాడ వైపు నుంచి జెట్టీ ద్వారా సముద్రంలోకి వెళ్లింది. అక్కడే ఉన్న లైఫ్ గార్డు తన విజిల్ ఊదుతూ నీటిలోకి వెళ్లొద్దని సూచించినా బాలురు వినలేదని పోలీసులు తెలిపారు. గల్లంతైన నలుగురు బాలురు శాంతాక్రజ్ ఈస్ట్ లోని వకోలాలోని దత్తా మందిర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

గంగా జమ్నా స్కూల్ హిజాబ్ వివాదం : ప్రిన్సిపల్ తో పాటు మరో ఇద్దరి అరెస్ట్.. అసలేం జరిగిందంటే ?

ఈ ఘటన జరిగిన సమయంలో బీచ్ లో మొత్తం నలుగురు లైఫ్ గార్డులు ఉన్నారని, 12 మంది బీచ్ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారని సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ముంబై పోలీసులు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదుగురిలో ఒక బాలుడిని రక్షించారు. ప్రాణాలతో బయటపడిన దీపేష్ కరణ్ (16) జెట్టీ సమీపంలో వేలాడుతున్న తాడును పట్టుకోవడంతో రెస్క్యూ సిబ్బందికి బాలుడిని కాపాడటం సులభం అయ్యింది. గల్లంతైన బాలురలను ధర్మేష్ భుజియావ్ (15), జయ్ తజ్ భరియా (16), సోదరులు మనీష్ (15), శుభం భోగానియా (16)గా గుర్తించారు. ప్రాణాలతో బయటపడిన కరణ్ ను తిరిగి ఇంటికి పంపించినట్లు పోలీసులు తెలిపారు.