విషాదం.. జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ ఎల్ఓసీ వద్ద బుల్లెట్ గాయంతో జవాను మృతి.. ఏం జరిగిందంటే ?
జమ్మూ కాశ్మీర్ లో పూంచ్ జిల్లాలోని ఎల్ ఓసీ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ఆర్మీ జవాను బుల్లెట్ గాయంతో మరణించారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది.
జమ్మూ కాశ్మీర్ లో విషాదం చోటు చేసుకుంది. పూంచ్ జిల్లాలో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో ఓ ఆర్మీ జవాను తన సర్వీస్ రైఫిల్ నుంచి వచ్చిన బుల్లెట్ గాయం వల్ల మరణించాడు. మృతి చెందిన జవానును అమృత్ పాల్ సింగ్ గా అధికారులు గుర్తించారు. ఆయన ప్రస్తుతం మన్ కోట్ సెక్టార్ లోని ఫార్వర్డ్ పోస్టులో విధులు నిర్వహిస్తున్నారు.
దారుణం.. ట్యాక్సీని చోరీ చేసి, డ్రైవర్ ను 200 మీటర్ల ఈడ్చుకెళ్లిన దొంగలు.. గాయాలతో బాధితుడు మృతి
ఎప్పటిలాగే ఆయన మన్ కోట్ సెక్టార్ లోని ఫార్వర్డ్ పోస్టులో బుధవారం తెల్లవారుజామున విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో తుపాకీ శబ్దం వినిపించింది. దీంతో ఆయన సహచరులు వెంటనే అక్కడికి పరిగెత్తారు. కానీ ఆలోపే అమృత్ పాల్ సింగ్ రక్తపు మడుగులో పడి ఉండి కనిపించారు.
101 ఏళ్ల కేరళ వృద్ధ విద్యార్థిని కార్త్యాయని అమ్మ కన్నుమూత.. తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన సీఎం
అయితే తన సర్వీస్ రైఫిల్ నుంచి వచ్చిన బుల్లెట్ కారణంగానే సింగ్ మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని అధికారులు వెలల్డించారు. ప్రమాదవశాత్తు ఆయుధం కింద పడటం వల్ల బుల్లెట్ పేలిందా ? లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారా అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉందని వెల్లడించారు. నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు