రోడ్డుపై నడుస్తున్న ఓ మహిళ, నాలుగేళ్ల బాలుడిపై నుంచి ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. మహిళ తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయింది.
మధ్యప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. బస్సు కింద పడి ఓ మహిళ, నాలుగేళ్ల బాలుడు మరణించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మృతి చెందిన ఒకరికొకరు అత్తా, మేనళ్లుడి వరుస అవుతారు. వీరిద్దరూ రోడ్డుపై నడుస్తున్న సమయంలో బస్సు ఢీకొట్టి, వారిపై నుంచి దూసుకెళ్లింది.
88 ఏళ్ల లేటు వయసులో రూ. 5 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు.. ఆ డబ్బుతో ఏం చేస్తాడంటే?
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ బస్సు మధ్యప్రదేశ్ లోని నర్సింగ్ పూర్ నుంచి సాగర్ కు వెళ్తోంది. అయితే ఈ క్రమంలో బస్సు కరేలి ఓవర్ బ్రిడ్జికి సమీపంలోకి చేరుకుంది. అయితే ఇదే సమయంలో ఓ మహిళ, ఆమె నాలుగేళ్ల మేనల్లుడిని తీసుకొని రోడ్డుపై నడుస్తున్నారు. ఒక్క సారిగా ఆ బస్సు వారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో మేనళ్లుడు అక్కడికక్కడే మరణించాడు. ఆ మహిళకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి. ఆమెను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ ఆమె చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి మరణించింది.
ఆరెస్సెస్ ను తాలిబన్లతో పోలుస్తూ బీజేపీపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
ఈ నెల 8వ తేదీన యూపీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్ స్టూడెంట్ ను కారు ఢీకొట్టి, 15 కిలో మీటర్లు లాక్కెళ్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి నగరం హర్దోయ్‌లో 15 ఏళ్ల కేతన్‌కుమార్ స్థానికంగా ఉన్న ఓ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే తన సైకిల్ పై శనివారం కూడా కోచింగ్ క్లాస్ కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ తెల్లటి వ్యాగన్‌ఆర్ పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ బాలుడి కాలు కారు వెనకాల భాగంలో చిక్కుకుపోయింది. అయితే దీనిని కారులో ఉన్న వ్యక్తులు గమనించినప్పటికీ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలనే ఉద్దేశంతో వాహనాన్ని వేగంగా పోనిచ్చారు. స్థానికులు కారు ఆపాలని ఎంతగా అరిచినా కూడా వారు వినలేదు. బాలుడిని ఈడ్చుకుంటూనే వెళ్లిపోయారు. దీంతో కేతన్ కుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడిని స్థానికులు సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు.
బురఖాను వ్యతిరేకించే వారిని నగ్నంగా ఊరేగించాలి- మొరాదాబాద్ కాలేజీ వివాదంపై అలీఘర్ మాజీ ఎమ్మెల్యే
అంతకు రెండు రోజుల క్రితం యూపీలోని నోయిడాలో డెలివరీ బాయ్ టూ వీలర్ ను ఢీకొట్టింది. అతడిని కూడా 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో మృతి చెందాడు. అలాగే జనవరి 1 తెల్లవారుజామున ఢిల్లీలోని కంఝవాలా ప్రాంతంలో 20 ఏళ్ల అంజలి సింగ్ అనే మహిళ కారుతో సుమారు 12 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆమె మరణించింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.
