Asianet News TeluguAsianet News Telugu

బురఖాను వ్యతిరేకించే వారిని నగ్నంగా ఊరేగించాలి- మొరాదాబాద్ కాలేజీ వివాదంపై అలీఘర్ మాజీ ఎమ్మెల్యే

బురఖాను వ్యతిరేకించే వారిని నగ్నంగా ఉరేగించాలని అలీఘర్ మాజీ ఎమ్మెల్యే, సమాజ్ వాదీ పార్టీ నేత జమీర్ ఉల్లా ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమను తాము కప్పుకోవడం భారతదేశ సంస్కృతిలో భాగం అని తెలిపారు. 

Opponents of burqa should be paraded naked- Aligarh Ex-MLA on Moradabad College controversy
Author
First Published Jan 20, 2023, 1:56 PM IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్‌లోని కాలేజీ ప్రాంగణంలోకి  బురఖా ధరించిన విద్యార్థులను రానివ్వకుండా అడ్డుకున్న ఘటనపై సమాజ్‌వాదీ నాయకుడు, అలీఘర్ మాజీ ఎమ్మెల్యే జమీర్ ఉల్లా ఖాన్ స్పందించారు. బురఖాను వ్యతిరేకించే వారిని నగ్నంగా ఉరేగించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొరాదాబాద్ కాలేజీలో బురఖా వివాదంపై వ్యాఖ్యానించాలని మీడియా కోరినప్పుడు ఆయన ఈ విధంగా మాట్లాడారు. 

తొలిసారి జాకెట్‌లో కనిపించిన రాహుల్ గాంధీ.. కశ్మీర్‌లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

‘‘బురఖాను నిషేధించడం పూర్తిగా తప్పు. అమ్మాయిలు కాలేజీకి వెళ్లాలనుకుంటే దాన్ని ధరించేందుకు అనుమతించాలి. హిజాబ్ పై నిషేధం ఉండకూడదు. ఎవరైనా దాన్ని నిషేధించాలనుకుంటే ఆ వ్యక్తిని నగ్నంగా ఊరేగించాలి. తనను తాను కప్పుకోవడం భారతదేశంలో ఒక సంస్కృతి. మీరు ఏదైనా ఒక గ్రామానికి వెళితే మా తల్లులు, సోదరీమణులు ఘుంఘాట్ (ముసుగు) లో కనిపిస్తారు’’ అని జమీరుల్లా ఖాన్ అన్నారు.

ఢిల్లీలో పొగమంచు.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు, 16 రైళ్లు..

ఎవరినైనా నగ్నంగా ఉంచడం వల్ల ప్రయోజనం ఏమిటని మీడియా అతడిని ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. అలా చేస్తేనే వారికి తమను తాము కప్పుకోవడం వల్ల ఉండే ప్రాముఖ్యతను వారు అర్థం చేసుకుంటారని అన్నారు. ఎవరు ఏదైనా ధరించి కాలేజీకి వెళ్లే వెసులుబాటు కల్పించాలని తెలిపారు. ‘నగ్నంగా తిరగడం నేరమయితే, అమ్మాయిలను బహిర్గతం చేయడం (బురఖా తొలగించడం) కూడా నేరమే. ఇలాంటి పనులు చేస్తున్న వారంతా అజ్ఞానులు, మూర్ఖులు’ అని ఆయన అన్నారు. 

అసలేం జరిగిందంటే ? 
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోని హిందూ కళాశాలలో విద్యార్థులకు యూనిఫాం కోడ్ అమలు ఉంది. అయినా కూడా కొందరు ముస్లిం బాలికలు బురఖా ధరించి కళాశాలకు వెళ్లారు. దీంతో వారికి లోపలికి అనుమతి లభించలేదు. దీంతో విద్యార్థిణులు నిరసన వ్యక్తం చేశారు. బురఖా ధరిస్తే కళాశాల అధికారులు లోపలికి రానివ్వడం లేదని, ప్రవేశ ద్వారం వద్ద హిజాబ్‌ను తీయాలని బలవంతం చేశారని వారు ఆరోపించారు. దీంతో విద్యార్థులు, సమాజ్‌వాదీ ఛత్ర సభ కార్యకర్తలు, అధికారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

దారుణం.. కూతురు పుట్టిందని స్వీట్లు పంచి.. అదే కవర్లో శిశువును పెట్టి.. పొలంలో పారేసి..

కాగా.. దీనిపై కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎపీ సింగ్ మాట్లాడుతూ.. తాము ఇక్కడ విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. దానిని అందరూ పాటించాలని సూచించారు. డ్రెస్ కోడ్ పాటించడానికి నిరాకరించే వారిని క్యాంపస్ లోకి అనుమతించబోమని అన్నారు. దీంతో కాలేజీ డ్రెస్‌కోడ్‌లో బురఖాను చేర్చాలని, బాలికలు వాటిని ధరించి తరగతులకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సమాజ్‌వాదీ ఛత్ర సభ కార్యకర్తలు మెమోరాండం సమర్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios