Asianet News TeluguAsianet News Telugu

ఆరెస్సెస్ ను తాలిబ‌న్ల‌తో పోలుస్తూ బీజేపీపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే

Punjab : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఆ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్ర‌భుత్వంపై మ‌రోసారి తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. పఠాన్‌కోట్‌లో భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా లో ఆయ‌న మాట్లాడుతూ.. బీజేపీ కేవలం ఎన్నికల్లో గెలవాలని మాత్రమే నిర్ణయించుకుందని ఆరోపించారు. భారతదేశ పౌరుల సంక్షేమం కోసం ఏమీ ఆలోచించడం లేద‌నీ, వారి సంక్షేమం కోసం ఏమీ చేయ‌డం లేద‌ని  విమ‌ర్శించారు.
 

Punjab : Congress chief Mallikarjun Kharge compares RSS with Taliban, hits out at BJP
Author
First Published Jan 20, 2023, 2:08 PM IST

Congress chief Mallikarjun Kharge: ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాల‌ను కూల్చి బీజేపీ అధికారం ద‌క్కించుకుంటున్న‌ద‌ని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే ఆరోపించారు. ఆరు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు మ‌ద్ద‌తు తెలిపి అధికారం అప్ప‌గిస్తే.. బీజేపీ ప్ర‌లోభాలు, బెదిరింపుల‌తో ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చింద‌నీ, ప్ర‌జ‌ల నిర్ణ‌యాన్ని అణ‌చివేసింద‌ని అన్నారు. బీజేపీ కేవలం ఎన్నికల్లో గెలవాలని మాత్రమే నిర్ణయించుకుందని ఆరోపించారు. భారతదేశ పౌరుల సంక్షేమం కోసం ఏమీ ఆలోచించడం లేద‌నీ, వారి సంక్షేమం కోసం ఏమీ చేయ‌డం లేద‌ని  విమ‌ర్శించారు.

భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్న మ‌ల్లికార్జున ఖ‌ర్గే.. 

గురువారం పంజాబ్ లో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పఠాన్ కోట్  లో ఏర్పాటు చేసిన స‌భలో ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలోనే ఆరెస్సెస్, బీజేపీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), తాలిబన్ల మధ్య పోలికలను చూపి కాంగ్రెస్ నాయకులను బెదిరించడానికి, తమ వైపుకు లాక్కోవడానికి  బీజేపీ ప్ర‌భుత్వం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఉప‌యోగించుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్న‌ద‌ని ఆరోపించారు.

ఎన్నిక‌ల్లో గెలుపు కోస‌మే బీజేపీ ఆరాటం.. ప్ర‌జ‌లు సంక్షేమంతో ప‌నిలే.. ! 

పఠాన్ కోట్ లో ప్రసంగించిన కాంగ్రెస్ సీనియర్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే.. బీజేపీకి కేవ‌లం ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆరోపించారు. భారత పౌరుల సంక్షేమం కోసం ఆలోచించడం లేద‌నీ, వారి సంక్షేమం కోసం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు.  'బెదిరింపుల ద్వారా త‌మ వారిని బీజేపీ త‌మ‌వైపున‌కు తిప్పుకుంది. వారు (బీజేపీ) మా ఆరు కాంగ్రెస్ ప్రభుత్వాలను దొంగిలించారు. మాకు ప్ర‌జ‌లు అధికారం ఇచ్చిన ఆరు రాష్ట్రాలను దోచుకున్నారు. తమకు అధికారం ఉందని, ప్రజలు కాంగ్రెస్ ను ఎన్నుకుని తీసుకువచ్చారని, దాన్ని భగ్నం చేసి ప్రజలను దూరం చేశారన్నారు. కొందరికి డబ్బులిచ్చి, మరికొందరికి అత్యాశ చూపించి, మరికొందరిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ల‌తో బెదిరించి.. పార్టీ మారేలా చేశారు. వారి పాల‌న ఇలాగే కొన‌సాగుతున్న‌ది' అని ఖర్గే మండిప‌డ్డారు. ఇలాంటి బీజేపీని 'దొంగలు' లేదా 'బందిపోట్లు' అని పిలవాలా అనేది తనకు తెలియదని ఖర్గే విమ‌ర్శ‌లు గుప్పించారు.

తాలిబన్లకు సమాంతరంగా ఆర్ఎస్ఎస్ నడుస్తోంది.. 

తాలిబన్లకు సమాంతరంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నడుస్తోందని ఖర్గే ఆరోపించారు. "మనుస్మృతిలో లేదా ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలకు స్థానం లేదు. స్త్రీలను హీనంగా పరిగణిస్తారు. వారిని చదువుకోనివ్వరు. తాలిబాన్లు ఆడపిల్లలను చదువుకోనివ్వకుండా ఎలా ప్రయత్నిస్తున్నారో నేను చదివాను. ఇది ముందు ఇక్కడ ఉంది.. ఇప్పుడు ఇక్కడ ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కూడా అదే ప్రయత్నం చేస్తున్నాయని" ఆయన అన్నారు. బీజేపీ కేవలం ఎన్నికల విజయంపైనే ఆసక్తి చూపుతోందని, భారత ప్రజల సంక్షేమం కోసం ఆలోచించడం లేదా పనిచేయడం లేదని ఆరోపించారు. పార్లమెంటులో ప్రజలకు సంబంధించిన ఏదైనా చర్చ వస్తే సభను ప్రభావితం చేసి కొన్ని సాకులు చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లను ఆరెస్సెస్ తో పోలుస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జవహర్ లాల్ నెహ్రూ రూపొందించిన రాజ్యాంగాన్ని ఆరెస్సెస్ గౌరవించడం లేదని ఆరోపించారు.

భార‌త్ జోడో యాత్ర‌తో బీజేపీ ఆందోళ‌న‌..

కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో ముందుకు సాగుతున్న దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర‌తో బీజేపీ ఆందోళన‌కు గుర‌వుతున్న‌ద‌ని మ‌ల్లికార్జున ఖ‌ర్గే అన్నారు. భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలు లక్షలాది మంది పాల్గొంటున్నార‌ని తెలిపారు. భార‌త్ జోడో యాత్ర విజయం బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని పేర్కొన్నారు. అందుకే బీజేపీ నేతలు మాపై కొన్ని ఆరోపణలు చేస్తున్నారని ఖ‌ర్గే అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios