Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో రాజకీయ కలకలం.. ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమిలో చీలిక.!

తమిళనాడులోని అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో ఉద్రిక్తత నెలకొంది. కూటమి చీలిక దిశగా పయనిస్తున్నదా? అనే ప్రశ్నలను లేవనెత్తుతూ స్థానిక మీడియాలో వార్తా కథనాలు వస్తున్నాయి.

New row erupts in Tamil Nadu AIADMK BJP alliance heading towards split?
Author
First Published Mar 19, 2023, 10:32 AM IST

తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు వేడెక్కాయి. తాజా పరిణామాలను పరిశీలిస్తే.. ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమిలో చీలిక వస్తుందా ? అంటే.. అవుననే సమాధానం వస్తుంది. తర్వలో ఈ రెండు పార్టీలు వీడిపోతున్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే.. బీజేపీ, ఏఐఏడీఎంకే పార్టీ మధ్య వివాదం ముదురుతోంది. కూటమి ధర్మాలను విస్మరించి.. ఏఐఏడీఎంకే నేతలు తన నాయకులు లాక్కుంటున్నారని బీజేపీ మండిపడుతున్నారు. ఈ ఇలా ఇరు నేతల మధ్య మాటల యుద్దం జరగుతుండటంతో ఇరు పార్టీల మధ్య పొత్తుపై సందిగ్ధత నెలకొంటోంది.

తమిళ న్యూస్ డైలీ దిన తంతి తాజాగా తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం చెన్నైలో జరిగిన బీజేపీ రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్ల సమావేశంలో  అన్నాడీఎంకే గురించి చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కె అన్నామలై ..  2024 లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ అధిష్ఠానం అన్నాడీఎంకేతో పొత్తుతో పోటీ చేస్తే .. తాను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తానని, సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని అన్నామలై చెప్పినట్లు భావిస్తున్నారు.

ఇతర మీడియా నివేదికల ప్రకారం.. అన్నామలై తమిళనాడులో బిజెపి ఎదగాలంటే.. స్వతంత్రంగా ఎన్నికలలో స్వతంత్రంగా పనిచేయగలగాలని అన్నామలై సూచించినట్లు సమాచారం. అంతే కాకుండా.. ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే.. అవినీతి, వంశ రాజకీయాలపై బీజేపీ వైఖరిని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తారని  అన్నామలై నివేదించారు. అయితే.. ఈ వ్యాఖ్యలను కొందరు బీజేపీ నేతలు ధృవీకరించగా, మరికొందరు ఆ వార్తలను ఖండించారు. 

క్లోజ్డ్ డోర్ సమావేశానికి హాజరైన రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ.. “ఇది ఒక రహస్య సమావేశం కాబట్టి మేము వివరించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఈ రోజు వచ్చిన వార్తాకథనాలు సరైనవి కావు. ఇది తప్పు." అంటూ ఖండించారు. కాగా.. తమిళనాడు బీజేపీ శాసనసభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ.. సమావేశంలో అన్నామలై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారనీ, పొత్తుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కేంద్ర నాయకత్వమే తీసుకుంటుందని చెప్పారు. అన్నామలైని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని చెప్పుకొచ్చారు.  

మరోవైపు..  ఈ వివాదం గురించి అడిగినప్పుడు, అన్నామలై అలాంటి వ్యాఖ్యలు చేస్తేనే తమ పార్టీ స్పందిస్తుందని అన్నాడీఎంకే సీనియర్ నేత డి జయకుమార్ అన్నారు. తమిళనాడులో కూటమి ఎప్పుడూ అన్నాడీఎంకే నేతృత్వంలోనే ఉంటుందని పునరుద్ఘాటించారు. రెండు కూటమి భాగస్వాముల మధ్య అంతా బాగానే ఉందా?  అని అడిగిన ప్రశ్నకు  అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు సానుకూలంగా సమాధానం ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios