Asianet News TeluguAsianet News Telugu

విషాదం.. నిద్రపోతున్న రెండున్నరేళ్ల బాలుడి నోట్లో పడిన బల్లి.. అస్వస్థతతో మృతి

నోట్లో బల్లిపడటంతో ఓ బాలుడు నిద్రలోనే కన్నుమూశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ లో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. 

Tragedy.. A lizard fell into the mouth of a sleeping two-and-a-half-year-old boy.. He died of illness..ISR
Author
First Published Jul 25, 2023, 6:57 AM IST

ఆ బాలుడికి రెండున్నరేళ్లు. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎక్కవగా చిన్నారులు సహజంగా తెల్లవారుజామున నిద్రలో నుంచి లేస్తారు. ఆ బాలుడు కూడా అలాగే లేసి, మళ్లీ ఉదయం 8 గంటల సమయంలో పడుకున్నాడు. కానీ ఆ నిద్రలోనే శాస్వతంగా కన్నుమూశాడు. పడుకున్న సమయంలో ఆ బాలుడి నోట్లో బల్లిపడటమే ఈ మరణానికి కారణం. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఇక వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ కోచ్ లు.. వచ్చే ఏడాది అందుబాటులోకి..

వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కోర్బా జిల్లా నాగిన్‌భాంఠా ప్రాంతంలో రాజ్ కుమార్ సందే కు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు. ఈ ముగ్గురు పిల్లల్లో చిన్నవాడైన జగదీశ్ ప్రస్తుతం రెండున్నర సంవత్సరాలు. అయితే ఎప్పటిలాగే గత సోమవారం ఆ బాలుడు తెల్లవారుజామున నిద్రలో నుంచి లేచాడు. మళ్లీ ఉదయం 8 గంటల సమయంలో నిద్రపోయాడు. 

కెనడాలో భారతీయ విద్యార్థిపై దాడి.. చికిత్స పొందుతూ మృతి.. అసలేం జరిగిందంటే?

బాలుడిని మంచంపై పడుకోబెట్టి, ఇంట్లో పనుల్లో తల్లి నిమగ్నం అయ్యింది. ఈ క్రమంలో మధ్యలో ఒక సారి బాలుడిని చూసి వద్దామని వెళ్లింది. అయితే అతడి నోట్లో బల్లి పడి, చనిపోయి ఉండటం గమనించి ఒక్క సారిగా షాక్ అయ్యింది. బాలుడు కూడా అపస్మారకస్థితిలో ఉండటం చూసి రోదించడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు వినిపించడంతో స్థానికులు వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు.

"చంపేస్తాం.." : న్యాయమూర్తులకు దుబాయ్ గ్యాంగ్ బెదిరింపులు

అయితే అప్పటికే జగదీశ్ మరణించి కనిపించాడు. అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపడుతున్నారు. అయితే బల్లి విషంతో బాలుడు చనిపోయే అవకాశం లేదని నిపుణులు పేర్కొన్నారు. కాకపోతే అది నోట్లో పడటం ఊపిరి ఆడక మరణించి ఉండొచ్చని, పోస్టుమార్టం నివేదికలో ఏం జరిగిందనేది వెల్లడి కావచ్చని తెలిపారు. ఈ ఘటనా స్థానికంగా విషాదాన్ని నింపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios