Asianet News TeluguAsianet News Telugu

ఆర్థిక పరివర్తన, గ్రామీణాభివృద్ధికి పర్యాటకం తోడ్పడుతుంది: కేంద్ర మంత్రి జీ.కిష‌న్ రెడ్డి

New Delhi: ఆర్థిక పరివర్తన, గ్రామీణాభివృద్ధికి పర్యాటకం తోడ్పడుతుందని కేంద్ర మంత్రి జీ.కిష‌న్ రెడ్డి అన్నారు. "గ్రామీణ పర్యాటక దృష్టి గ్రామాలు, దేశ జీవన విధానం, దాని ఆధ్యాత్మిక-సాంస్కృతిక వారసత్వం-ప్రకృతి అందాలను ప్రదర్శించడం" అని ఆయ‌న తెలిపారు. 
 

Tourism will help in economic transformation and rural development: Union Minister G Kishan Reddy
Author
First Published Feb 8, 2023, 3:30 PM IST

Union Minister for Culture and Tourism G Kishan Reddy: ప‌ర్యాట‌క రంగంలో గ్రామాలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి అన్నారు. అలాగే, ఆర్థిక పరివర్తన, గ్రామీణాభివృద్ధికి పర్యాటకం తోడ్పడుతుందని తెలిపారు. "గ్రామీణ పర్యాటక దృష్టి గ్రామాలు, దేశ జీవన విధానం, దాని ఆధ్యాత్మిక-సాంస్కృతిక వారసత్వం-ప్రకృతి అందాలను ప్రదర్శించడం" అని ఆయ‌న పేర్కొన్నారు.  

వివ‌రాల్లోకెళ్తే.. ఆర్థిక పరివర్తన, గ్రామీణాభివృద్ధి, కమ్యూనిటీ శ్రేయస్సుకు పర్యాటక రంగం సానుకూల శక్తిగా ఉంటుందని కేంద్ర మంత్రి జీ కిష‌న్ రెడ్డి అన్నారు. జీ-20 దేశాల‌ అధ్యక్ష పదవీకాలంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కీలకమైన విభాగాన్ని ఉపయోగించాలని భారతదేశం యోచిస్తోందని ఆయ‌న తెలిపారు. గుజరాత్ లోని కచ్ జిల్లాలోని టెంట్ సిటీ ధోర్డోలో మూడు రోజుల పాటు జరిగే జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ (టీడబ్ల్యూజీ) సమావేశం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ఈ క్ర‌మంలోనే పై వ్యాఖ్య‌లు చేశారు. జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ కార్యవర్గానికి ఇదే తొలి సమావేశం.

'కమ్యూనిటీ ఎంపవర్ మెంట్ అండ్ పేదరిక నిర్మూలన కోసం గ్రామీణ పర్యాటకం' అనే అంశంపై జరిగిన ప్యానెల్ డిస్కషన్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్ డీజీ) సాధించేందుకు పర్యాటక రంగాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవడంపై భారత్ దృష్టి సారించిందన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు భూగోళాన్ని పరిరక్షిస్తూనే శ్రేయస్సును పెంపొందించడానికి అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చాయి. భారతదేశ ఆత్మ దాని గ్రామాలలో నివసిస్తుంది" అని మంత్రి మహాత్మా గాంధీ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ పేర్కొన్నారు. 

పల్లెలు, దేశ జీవన విధానం, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం, ప్రకృతి అందాలను ప్రదర్శించడంపై గ్రామీణ పర్యాటకం దృష్టి సారించాలన్నారు. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం పర్యాటక రంగానికి ఉంద‌నీ, అందువల్ల ఆర్థిక పరివర్తన, గ్రామీణాభివృద్ధి, సమాజ శ్రేయస్సుకు పర్యాటకం సానుకూల శక్తిగా ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. 

కాగా, జీ20 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు రాన్ ఆఫ్ కచ్ లో టూరిజం వర్కింగ్ గ్రూప్ (టీడబ్ల్యూజీ) ప్రారంభ సమావేశానికి గుజరాత్ ఆతిథ్యమిచ్చింది. పర్యాటక మంత్రిత్వ శాఖ ఆతిథ్యమిస్తున్న జీ-20 కింద మొదటి టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం మంగ‌ళ‌వారం నాడు ప్రారంభం అయింది. ఈ సమావేశానికి 100 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్ సోమవారం తెలిపారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios