Asianet News TeluguAsianet News Telugu

కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాలపై దాడికి వచ్చిన పాకిస్తాన్ టెర్రరిస్టు హతం

జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌లో ఈ రోజు ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో కరడుగట్టిన లష్కరే తాయిబా టాప్ టెర్రరిస్టు హతమయ్యాడు. ఆ టెర్రరిస్టు ప్రధానంగా భారత భద్రతా బలగాలపై దాడులు, స్థానిక యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించే లక్ష్యంతో ఇక్కడకు వచ్చినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. టెర్రరిస్టు అబు జరారా హతమవ్వడం పాకిస్తాన్‌కు చెందిన లష్కరే ఉగ్ర సంస్థకు దెబ్బ అని పేర్కొన్నారు.

top lashkar terrorist eliminated in jammu kashmir
Author
Srinagar, First Published Dec 14, 2021, 6:56 PM IST

శ్రీనగర్: Jammu Kashmirలో సరిహద్దు గుండా ఉగ్రవాదుల(Terrorists)ను Pakistan పంపిస్తూనే ఉన్నది. అందుకే ఇటీవల అక్కడ పూంచ్ రజౌరీ సెక్టార్‌లో సరిహద్దుకు సమీపంలోని అడవిలో తరుచూ ఎన్‌కౌంటర్లు(Encounter) జరుగుతున్నాయి. తాజాగా ఈ రోజు కూడా స్థానికుల సమాచారం తో కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో కరడుగట్టిన ఓ ఉగ్రవాద హతమయ్యాడు. ఆ ఉగ్రవాది భారత భద్రతా బలగాలపై దాడి చేయాలనే లక్ష్యంతోనే మన దేశంలోకి అడుగుపెట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాదిని మట్టుబెట్టడంతో లష్కరే తాయిబాకు ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నాయి.

రజౌరీ సెక్టార్‌లో ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లలో మరణించిన ఉగ్రవాదుల సంఖ్య తాజాగా ఎనిమిదికి చేరింది. ఈ రోజు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కరుడుగట్టిన లష్కరే తాయిబా ఉగ్రవాది అబు జరారాను పోలీసులు మట్టుబెట్టారు. అబు జరారా ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఈ ఏరియాలో కనిపించాడు. కానీ, స్థానికులు పోలీసులకు సహకరించడంతో వారి కదలికలు కష్టంగా మారాయి. స్థానికులతోనూ జాగ్రత్తగా మెదిలే క్రమంలో వారు మరింత దూరం అడవిల లోపలికే వెళ్లి తాత్కాలిక ఆవాసాలు ఏర్పరుచుకున్నారు. కొన్ని నెలలుగా అడవి లోపలే ఉన్నారు. కానీ, కమ్యూనికేషన్, ఆహారం, ఇతర అవసరాలు వారిని బయటికి రాకుండా ఉండనీయలేవు. భయంతోనే ఉగ్రవాదులు పిర్ పంజ్ రేంజ్ పైనకూ చేరారు. దీంతో భద్రతా బలగాలు వారిని సులువుగా కార్నర్ చేయగలిగారు.

Also Read: జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం...

ఇలా వారు అప్పుడప్పుడ బయటకు రావడం, కదలికల కనిపిస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు అందించిన పక్కా సమాచారంతో జమ్ము కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా అడవిలో చాలా దూరం లోపలికి చొచ్చుకెళ్లారు. ఇది గమనించి ఉగ్రవాదులు పోలీసుల బలగాలపై ఫైరింగ్ జరిపారు. కానీ, అప్రమత్తమైన పోలీసులు తమను తాము రక్షించుకోవడంతోపాటు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది అబు జరారా హతమయ్యాడు.

అబు జరారా హతమవ్వడం భద్రతా బలగాల ప్రధాన విజయం అని ఓ సీనియర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డాడు. రజౌరీ, పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదాన్ని మళ్లీ పెంచి పోషించే లక్ష్యంతోనే ఆయనను భారత్‌లోకి పంపారని తెలిపారు. అంతేకాదు, భారత భద్రతా బలగాలపై భారీ దాడులు చేపట్టాలనే ప్రధాన లక్ష్యంతో ఆయన వచ్చాడనీ పేర్కొన్నారు. స్థానిక యువతనూ టెర్రరిజంలోకి ఆకర్షించడమూ అబు జరారా మరో లక్ష్యంగా ఉన్నదని తెలిపారు. 

Also Read: మన హక్కులు తిరిగి పొందడానికి రైతుల తరహాలోనే త్యాగాలు అవసరం: ఫరూఖ్ అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్ లో గత బుధవారం ఉదయం జరిగిన encounterలో ముగ్గురు గుర్తుతెలియని terroristsలు హతమయ్యారు. షోపియాన్ జిల్లా ఈ చోలన్ గ్రామం వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆర్మీ, సిఆర్పీఎఫ్ బలగాలతో కలిసి Cordon Search చేపట్టారు.  

ఉగ్రవాదులు కనిపించడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. షోపియాన్ జిల్లా చోలన్ ఏరియాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూ కాశ్మీర్ జోన్ పోలీసులు బుధవారం ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios