Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతం...

షోపియాన్ జిల్లా చోలన్ ఏరియాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూ కాశ్మీర్ జోన్ పోలీసులు బుధవారం ట్వీట్ చేశారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులకు కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తున్నాయి. 

Three unidentified terrorists killed in encounter in Jammu and Kashmir
Author
Hyderabad, First Published Dec 8, 2021, 12:43 PM IST

శ్రీనగర్ :  జమ్మూకాశ్మీర్ లో బుధవారం ఉదయం జరిగిన encounterలో ముగ్గురు గుర్తుతెలియని terroristsలు హతమయ్యారు. షోపియాన్ జిల్లా ఈ చోలన్ గ్రామం వద్ద ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆర్మీ, సిఆర్పీఎఫ్ బలగాలతో కలిసి Cordon Search చేపట్టారు.  

ఉగ్రవాదులు కనిపించడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. షోపియాన్ జిల్లా చోలన్ ఏరియాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూ కాశ్మీర్ జోన్ పోలీసులు బుధవారం ట్వీట్ చేశారు. భద్రతా బలగాలు ఉగ్రవాదులకు కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తున్నాయి. 

ఇదిలా ఉండగా, ఈ నెల ఒకటో తారీఖున జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. డిసెంబర్ ఒకటిన jammu and kashmirలోని పుల్వామా మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు బుధవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని కస్‌బయార్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. 

corona third wave :కరోనా థర్డ్‌వేవ్ తప్ప‌దు.. మ‌రో రెండు నెలల్లో పీక్ స్టేజ్

 ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీనిని గమనించిన టెర్రరిస్టులు ఫైరింగ్‌ జరిపారు. వారిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు కూడా కాల్పులకు దిగడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు ఉగ్రవాదుల కదలికలతో సైన్యం అప్రమత్తమైంది. స్థానిక ప్రజలను అలర్ట్‌ చేసింది. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడ పడుతున్నారు. దీంతో ఉగ్రవాదులు దాగి ఉన్నారేమోనని అణువణువూ గాలిస్తున్నారు. 

మృతుల్లో jaishe mohammed ఉగ్రవాదసంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్​ పరే​ ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్​కుమార్ తెలిపారు. ఐఈడీ అమర్చడంలో యాసిర్ సిద్ధహస్తుడని ఆయన వెల్లడించారు. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో వీరికి ప్రమేయం ఉన్నట్లు విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌‌లో ఉగ్రవాద కార్యకలాపాలు బాగా పెరిగాయి. 

దీంతో సీఆర్ఫీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీస్ బలగాలు ఉమ్మడిగా ఏరివేతకు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ  క్రమంలోనే గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో lashkar e taiba ఉగ్రవాద సంస్థ అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫోర్స్‌కు సంబంధించిన ముష్కరులు హతమయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios