Asianet News TeluguAsianet News Telugu

March 21- Top Ten News: టాప్ టెన్ వార్తలు

ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు.
 

todays top news telugu news online kms
Author
First Published Mar 21, 2024, 5:59 PM IST

రూ. 10 వేల నుంచి రూ .15 వేల పంట నష్టపరిహారం

పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు పరిహారాన్ని అందిస్తామని మంత్రి జూపల్లి అన్నారు. నష్టపోయిన ప్రతి రైతును తమ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పూర్తి కథనం

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్‌లో ఈడీని అరెస్టు చేయవద్దని ఆదేశించలేమని స్పష్టం చేసింది. పూర్తి కథనం

సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన పతంజలి

ఇక నుంచి తప్పుదోవ పట్టింటచే ప్రకటనలు చేయబోమని పతంజలి సంస్థ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆయుర్వేదం ద్వారా జీవనశైలి సంబంధిత వ్యాధులను నయం చేయడమే కంపెనీ ఉద్దేశమని పేర్కొంది. పూర్తి కథనం

సూర్య ‘కంగువ’స్టోరీ లైన్ ఇదే

ఈ చిత్రం కథ ఓ గిరిజన యోధుడు చుట్టూ తిరుగుతుంది. అతను 1678 నుంచి ఈ కాలానికి వస్తాడు. అతను ఓ మహిళా సైంటిస్ట్ సాయింతో తన మిషన్ ని పూర్తి చేయాలనుకుంటాడు. పూర్తి కథనం

ఎంఎస్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగే ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ కు ముందు లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించింది. ధోనీకి బదులుగా గైక్వాడ్‌ తో వున్న ఫొటోస్ వైరల్ గా మారాయి. పూర్తి కథనం

నీ భర్త ఒక్కరోజుకు నాకు కావాలి

హీరో సూర్య అభిమాని ఒకరు కోర కూడని కోరిక కోరింది. జ్యోతికతో నీ భర్త నాకు ఒకరోజుకు కావాలని అడిగింది. సదరు అభిమానికి జ్యోతిక రిప్లై ఇచ్చింది. పూర్తి కథనం

బీజేపీ పాలన మంచిది కాదు: షర్మిల

బీజేపీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ చేస్తున్న మోసానికి చంద్రబాబు నాయుడు, జగన్ లు ఇద్దరు మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని బీజేపీ అంబానీ, అదానీలకు దోచి పెట్టిందని అన్నారు.పూర్తి కథనం

చేతిలో రూపాయి లేదు.. కాంగ్రెస్ ఆవేదన

కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని ఆ పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రానికి నేరపూరిత చర్య అని వివరించింది. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు మీడియా సమావేశం నిర్వహించింది. పూర్తి కథనం

పవన్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత

పవన్ కళ్యాణ్‌ను ఓడించేవారిలో టీడీపీ వాళ్లే ముందు ఉంటారని వైసీపీ ఆరోపించింది. దీనికి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తమదేనని పేర్కొంటూ జగన్ పైనా విమర్శలు సంధించింది. పూర్తి కథనం

ధోనిని ఢీ కొట్ట‌నున్న విరాట్ కోహ్లీ

CSK vs RCB: ఐపీఎల్ 2024 లో మార్చి 22న బెంగ‌ళూరు-చెన్నై టీమ్ లు త‌ల‌ప‌డ‌నున్నాయి. విరాట్ కోహ్లి తన కొడుకు అకాయ్ వ‌చ్చిన జోష్ లో ఉండ‌గా, సీఎస్కే టీమ్ కు మ‌రో టైటిల్ ను అందించాల‌ని ఎంఎస్ ధోని వ్యూహాల‌తో బ‌రిలోకి దిగుతున్నారు. పూర్తి కథనం

Follow Us:
Download App:
  • android
  • ios