AP News: పవన్ కళ్యాణ్‌ను టీడీపీ వాళ్లే ఓడిస్తారు.. లక్ష ఓట్ల మెజర్టీతో గెలిపించే బాధ్యత మాదే
పవన్ కళ్యాణ్‌ను ఓడించేవారిలో టీడీపీ వాళ్లే ముందు ఉంటారని వైసీపీ ఆరోపించింది. దీనికి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తమదేనని పేర్కొంటూ జగన్ పైనా విమర్శలు సంధించింది.
Pawan Kalyan: టీడీపీ, బీజేపీలను ఏకతాటి మీదికి తేవడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సఫలీకృతుడయ్యాడు. ఈ మూడు పార్టీల పొత్తులో భాగంగా జనసేనకు పిఠాపురం సీటు దక్కింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడు. అక్కడి టీడీపీ టికెట్ దక్కుతుందని ఆశపడిన వాళ్లు మాత్రం పవన్ కళ్యాణ్‌కు సంపూర్ణంగా మద్దతు ఇచ్చేలా లేరు. ఈ విషయాన్ని వైసీపీ లేవనెత్తుతూ పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చింది.
ఓ పేపర్ క్లిప్‌ను జత చేసి వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా ఓ ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ జాగ్రత్త.. ఏదన్నా అటూ ఇటూ అయితే పిఠాపురం స్థానంలో నిన్ను ఓడించేవారిలో టీడీపీనే మొదటి వరుసలో ఉంటుందనుకుంటా.. కాస్త చూసుకో మరీ.. అంటూ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ పై టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్ రియాక్ట్ అయిది. మీ భార్య భారతి రాసే అబద్ధాలను చెల్లి షర్మిల ఛీ కొట్టింది అటూ సెటైర్ వేసింది. అలాంటిది జగన్ మాటలను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతారని అనుకుంటున్నారు? అంటూ ప్రవ్నించింది. అంతేకాదు, పవన్ కళ్యాణ్‌కు జనసైనికులకు తోడుగా టీడీపీ కార్యకర్తలు ఉంటారని, పేర్కొంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్‌ను లక్ష మెజార్టీతో గెలిపించే బాధ్యత తమదేనని స్పష్టం చేసింది. ఇంతటితో ఆగలేదు. అసలు జగన్ పోటీ చేసే పులివెందులలోనే సమస్యలు ఉన్నాయని ఆరోపించింది. కొంపలో కుంపటితో జగన్ పులివెందులలోనే బొక్క పడిందని పేర్కొంది. అది ముందు పూడ్చుకోవాలని సూచించింది. ఈ సారి సీఎం సీటుతోపాటు ఎమ్మెల్యేగా కూడా జగన్ ఓడిపోతాడని పేర్కొంది.