నీ భర్త ఒక్కరోజుకు నాకు కావాలి... అభిమాని వింత కోరిక, జ్యోతిక రిప్లై ఇదే!
హీరో సూర్య అభిమాని ఒకరు కోర కూడని కోరిక కోరింది. జ్యోతికతో నీ భర్త నాకు ఒకరోజుకు కావాలని అడిగింది. సదరు అభిమానికి జ్యోతిక రిప్లై ఇచ్చింది.
జ్యోతిక సైతాన్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది. అజయ్ దేవ్ గణ్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. జ్యోతిక, సూర్య, మాధవన్, అజయ్ దేవ్ గన్ కలిసి దిగిన ఫోటో జ్యోతిక ఇంస్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ ఫోటో క్రింద ఓ అభిమాని కామెంట్ పెట్టింది. ''జ్యోతిక గారు సిల్లును ఒరు కాదల్ చిత్రంలో మాదిరి నాకు మీ భర్త సూర్యను ఒకరోజుకు ఇవ్వండి...'' అని ఆమె కామెంట్ పెట్టింది.
సదరు అభిమానికి జ్యోతిక రిప్లై ఇచ్చింది. 'అలా చేయడం కుదరదు' అని జ్యోతి సమాధానం చెప్పింది. అయితే జ్యోతిక రిప్లై ఇవ్వడంతో సదరు అభిమాని ఉబ్బితబ్బిబు అయ్యింది. మీరు సమాధానం ఇవ్వడమే గొప్ప విషయం అని అభిప్రాయపడింది. ఇక జ్యోతికను సూర్య ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి 7 చిత్రాల్లో నటించారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
2006లో జ్యోతికను సూర్య వివాహం చేసుకున్నాడు. జ్యోతిక పెళ్ళయాక సినిమాలకు గుడ్ బై చెప్పింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. అనంతరం జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గ్లామర్ రోల్స్ కాకుండా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తుంది. సూర్య, జ్యోతిక నిర్మాతలుగా కూడా రాణిస్తున్నారు.
ఇటీవల జ్యోతిక, సూర్య ముంబై కి షిఫ్ట్ అయ్యారు. అక్కడే ఉంటున్నారు. జ్యోతిక వరుస హిందీ చిత్రాలు చేయడం విశేషం. నెక్స్ట్ ఆమె శ్రీ, డబ్బా కార్టెల్ అనే చిత్రాల్లో నటిస్తుంది. ఇక సూర్య కంగువా టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. కంగువా టీజర్ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. శివ కంగువా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.