Asianet News TeluguAsianet News Telugu

Today's Top Stories: నేడే ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన.. చంద్రబాబుతో పవన్ భేటీ.. దోమల దండయాత్ర..

Today's Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ న్యూస్ లో నేడే ఎమ్మెల్యేల మేడిగడ్డ పర్యటన..  మహారాష్ట్రలో దోమల దండయాత్ర..నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితి పెంపు .., నేడు చంద్రబాబుతో పవన్ భేటీ.. ఇప్పుడైనా సీట్ల పంచాయితీ తేలేనా ?, ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.., ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు.. వంటి వార్తల సమాహారం. 

Today top stories,  top 10 Telugu news, latest telugu news, online news, breaking news, Andhra Pradesh, Telangana february 13th headlines KRJ
Author
First Published Feb 13, 2024, 7:32 AM IST

Today's Top Stories:

Medigadda Barrage: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను నేడు (మంగళవారం) తెలంగాణ మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించాలని..ప్రభుత్వ ఆధ్వర్యంలో బస్సును ఏర్పాటు చేస్తుందని తెలిపారు. దీంతో నేడు మేడిగడ్డ సందర్శన షెడ్యూల్ ను ఖరారు చేశారు. దీంతో మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళ్లనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు కూడా ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీని సం దర్శించడానికి వెళ్లబోతున్నారు. 

నిరుద్యోగులకు శుభవార్త.. వయోపరిమితి పెంపు ..

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు, ఫైర్ సర్వీసెస్ వంటి యూనిఫాం సర్వీసులు కాకుండా మిగతా అన్ని పోస్టులకు వర్తించేలా పోటీ పరీక్షల అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 


సీఎం రేవంత్ రెడ్డితో షర్మిల భేటీ..

YS Sharmila: ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్నా విషయం తెలిసిందే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకరావాలని తీవ్రంగా చర్చిస్తోంది. ఈ క్రమంలో పలువురితో భేటీ అయి.. చర్చిస్తున్నారు. తాజాగా.. సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని వైఎస్ షర్మిల మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్‌ను కలవడం ఇదే మొదటిసారి.
ఇరువురి మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ విషయాన్ని షర్మిల తన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. 

కృష్ణా నదిపై ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

తెలంగాణ అసెంబ్లీలో  కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దనే విషయమై ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టింది.ఈ తీర్మానంపై  పలు పార్టీల సభ్యులు చర్చించారు. కృష్ణా నదిపై ఉన్న  ప్రాజెక్టులను  కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి  అప్పగించవద్దని  తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా సోమవారం నాడు తీర్మానం చేసింది. ఈ విషయమై ఇవాళ  తెలంగాణ అసెంబ్లీలో నీటి పారుదల శాఖ మంత్రి  ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి  తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై  సుధీర్ఘంగా చర్చ జరిగింది.ఈ చర్చ సందర్భంగా  అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగింది. భారత రాష్ట్ర సమితి తరపున హరీష్ రావు  ప్రసంగిస్తున్న సమయంలో  అధికార పక్షం తరపున  పలువురు మంత్రులు  ప్రసంగించారు. మంత్రుల తమపై చేసిన విమర్శలకు  హరీష్ రావు కూడ అదే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. 

హుక్కాపై ఉక్కు పాదం

Hookah Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మత్తు పదార్థాల విక్రయం, సరఫరాపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా వాటి కట్టడికి తీవ్రంగా కృషి చేస్తోంది. రాష్ట్ర పోలీసులు కూడా మత్తు పదార్థాల రహిత తెలంగాణ మార్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, హుక్కా పార్లర్ల నిషేధం విధించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మత్తు పదార్థాలపై నిషేధం విధించేలా బిల్లు ప్రవేశపెట్టింది. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. చర్చ లేకుండానే హుక్కా బిల్లును సభ ఆమోదించింది.  


'ఆడుదాం ఆంధ్రా' ముగింపు వేడుకలు..

Adudam Andhra: ప్రోత్సాహం ఉంటే సాధించలేనిది లేదు. క్రీడారంగంలో ప్రోత్సాహం లేక మరుగున పడ్డ ప్లేయర్లు ఎంతోమంది. అలాంటి మరుగునపడ్డ మాణిక్యాలేందరో.. అలాంటి వారిని వెలికి తీయాలనే ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ప్రోత్సాహం అందిస్తోంది.  అద్భుతమైన ప్లేయర్లను సిద్ధం చేసే దిశగా ఓ మాస్టర్ ప్లాన్స్ సిద్ధం చేసింది. గ్రామీణ స్థాయిలో అద్భుతమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ఓ  ఈవెంట్ ప్రారంభించింది. అదే.. ఆడుదాం ఆంధ్రా క్రీడా టోర్నీ .. సుమారు 50 రోజుల పాటు సాగిన క్రీడా టోర్నీ నేటీ(మంగళవారం)తో ముగిస్తోంది.  నేడు విశాఖపట్నంలో జరిగే ముగింపు కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు.ఈ టోర్నీలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి దాదాపు 25 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు అంచనా. 

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..

AP DSC Notification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఓ తీపి కబురు చెప్పింది. సోమవారం ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం 6,100 పోస్టులతో నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం మొత్తం 6,100 ఉద్యోగాల నియామకాలకు రంగం సిద్ధం చేసింది. ఇందులో 2,29 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 2,280 ఎస్జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపాల్ పోస్టు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి 2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు మరో ఐదేళ్ల వయోపరిమితిని పెంచారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://cse.ap.gov.in/‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

నేడు చంద్రబాబుతో పవన్ భేటీ.. ఇప్పుడైనా సీట్ల పంచాయితీ తేలేనా ?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజయం రసవత్తరంగా మారాయి.  కాగా.. టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకం ఇంకా కొలిక్కి రాలేదు. ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలి ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు పంచుకోవాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో సీట్ల పంపకాల అంశం కొలిక్కి రావొచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీలో చేర్చుకోవాలని, ఏపీలో కలిసి పోటీ చేద్దామని సూచించారు. కానీ ఈ విషయంలో ఆయనకు ఢిల్లీ పెద్దలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే జనసేన-బీజేపీకి కలిపి మొత్తంగా 50 సీట్లు ఇస్తే కూటమిలో చేర్చుకునే విషయం ఆలోచిస్తామని చెప్పినట్టు సమాచారం. ఏ విషయాన్నీ నేటీ  వరకు తేల్చాలని డెడ్ లైన్ విధించినట్టు తెలుస్తోంది. 


దోమల దండయాత్ర..

ముంబై: అమెరికా దేశంలో టోర్నడోలు తరచుగా సంభవిస్తుంటాయి.  టోర్నడోలు  పెను ఉత్పతాన్ని సృష్టిస్తాయి. టెక్నాలజీ పరంగా ముందున్న అమెరికా దేశం టోర్నడోలు వస్తే తీవ్రంగా నష్టపోతుంది.  అయితే ఇండియాలో కూడ  టోర్నడో  సంభవించినట్టుగా  సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి.  అయితే  ఈ టోర్నడో  దోమల టోర్నడో. మహారాష్ట్రలోని ముంధ్వా, కేశవనగర్ తదితర ప్రాంతాల్లో దోమల టోర్నడోలు తరహాలో  ఆకాశంలో  దృశ్యాలు కన్పించాయి. కొందరు ఈ దృశ్యాలను  రికార్డు  చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి.

కేఎల్ రాహుల్  దూరం

రాజ్ కోట్ లో ఇంగ్లాండ్ తో  జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ లో కె.ఎల్. రాహుల్ స్థానంలో దేవదత్  పడిక్కల్ ఎంపికయ్యాడు. ఈ నెల  15వ తేదీన రాజ్ కోట్ లో  మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కె.ఎల్. రాహుల్ మోకాలి నొప్పి కారణంగా  ఇబ్బంది పడుతున్నాడు. దీంతో కె.ఎల్. రాహుల్ ను మూడో టెస్ట్ లో తప్పించారు. కె.ఎల్. రాహుల్ స్థానంలో  దేవదత్ పడిక్కల్ ను బీసీసీఐ ఎంపిక చేశారు. విరాట్ కోహ్లి కూడ  భారత జట్టుకు దూరమయ్యాడు.  మరోవైపు కె.ఎల్. రాహుల్ కూడ దూరమయ్యారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios