Asianet News TeluguAsianet News Telugu

నేడే గుజరాత్ మొదటి దశ సంగ్రామం.. 19 జిల్లాల్లోని 89 సీట్లకు మొదలైన పోలింగ్..

దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు నేడు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో 19 జిల్లాని 89 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 5వ తేదీన రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. 

Today is the first phase of Gujarat elections.. Polling has started for 89 seats in 19 districts..
Author
First Published Dec 1, 2022, 8:50 AM IST

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి నేడు మొదటి దశ ఎన్నికలు జరగుతున్నాయి. దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాల్లో విస్తరించి ఉన్న మొత్తం 89 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5:30 గంటలకు ముగియనుంది. గత 27 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలనలో ఉన్న గుజరాత్‌లో అధికార పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్, కొత్తగా వచ్చి చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఆసక్తికరమైన ముక్కోణపు పోటీ నెలకొంది. 

మూడో భర్తను ముక్కలుగా నరికి చంపిన కేసులో ట్విస్ట్... ఇద్దరు భర్తలు ఏమయ్యారు? కూతురు, కోడళ్లకు ఏం జరిగింది?

89 అసెంబ్లీ స్థానాలకు 718 మంది పురుషులు, 70 మంది మహిళలు పాటు మొత్తంగా 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి 89 మంది అభ్యర్థులు, ఆప్ నుంచి 88 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డిసెంబర్ 5వ తేదీన రెండో దశ ఓటింగ్ జరగనుంది. ఆ సమయంలో 93 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపుపు చేపట్టనున్నారు.

 ఈ రాష్ట్రంలో బీజేపీ మరో సారి అధికారం ఆశిస్తోంది. కానీ ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ధీటుగా పోటీని ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీలో కొంత ఆందోళన కనిపిస్తోంది. 1995 నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీకి క్రమంగా సీట్ల సంఖ్య తగ్గిపోతోంది. 2002 నుంచి పార్టీ స్కోరు పడిపోతంది. అంతకు ముందు ఎన్నికల్లో బీజేపీకి 137 స్థానాలు ఉండగా.. 2018 నాటికి అది 99కి చేరింది. రాష్ట్రంలోని 182 సీట్లలో 140 సీట్లను పార్టీ లక్ష్యంగా పెట్టుకునే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా కార్యకలాపాలను సాగించారు. అలాగే జాతీయ స్థాయిలో ముఖ్య నాయకులను గుజరాత్ కు తీసుకొచ్చి ప్రచారం నిర్వహించారు.

పాకిస్థాన్ స‌రిహ‌ద్దులో 16 డ్రోన్ల‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్.. స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ‌కు కొత్త టెక్నాల‌జీ అవ‌స‌రం..

కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్ రాష్ట్రంలో అధికారం చేపట్టి మంచి జోరులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ సారి ఎన్నికల్లో బలంగానే బరిలోకి దిగింది. ఆ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత నెలలో అత్యధిక కాలం గడిపాడు. 2018 ఎన్నికల్లో ఖాతా తెరవడంలో విఫలమైన ఆప్ ఈ సారి కచ్చితంగా 92 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందులో 8 స్థానాలు సూరత్ లోనే ఉంటాయని జోస్యం చెప్పారు. విద్య, ఆరోగ్యంపై దృష్టి సారించి ఢిల్లీలో పార్టీ పాలనా విధానంలో మార్పులు తీసుకొచ్చిన ఆప్.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కానీ కేజ్రీవాల్ మాటలను అమిత్ షా తోసిపుచ్చారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ప్రజల మనస్సుల్లో ఎక్కడా లేదు. ఎన్నికల ఫలితాల కోసం వేచి ఉండండి. బహుశా గెలిచిన అభ్యర్థుల జాబితాలో ఆప్ పేరు ఉండకపోవచ్చు ’’ అని ఎద్దేవా చేశారు.

రూ. 1.90 కోట్ల బీమా సొమ్ము కోసం క‌ట్టుకున్న భార్యను క‌డ‌తేర్చిన భ‌ర్త

అయితే 2018లో 77 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్.. ఈ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర పోలీసుల పర్యవేక్షణలో కాకుండా కేంద్ర బలగాల ఆధీనంలో ఉంచాలని ఎన్నికల కమిషన్‌ను కోరనున్నట్లు తెలిపింది. కాగా.. గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రంగానే చేసింది. గత సారి ప్రచారానికి నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. పాదయాత్ర గుజరాత్ రాష్ట్రానికి చాలా దూరంలో ఉంది. దీంతో రాహుల్ గాంధీ ఈ సారి గుజరాత్ లో ఒక్క రోజు మాత్రమే ప్రచారం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios