Asianet News TeluguAsianet News Telugu

మూడో భర్తను ముక్కలుగా నరికి చంపిన కేసులో ట్విస్ట్... ఇద్దరు భర్తలు ఏమయ్యారు? కూతురు, కోడళ్లకు ఏం జరిగింది?

కొడుకుతో కలిసి భర్తను చంపి, ముక్కలుగా చేసి ప్రిడ్జ్ లో దాచిపెట్టిన కేసులో.. నిందితుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు అతను మూడో భర్త అని తేలింది. 

sensational truths behind pandav nagar murder case
Author
First Published Dec 1, 2022, 8:25 AM IST

ఢిల్లీ : శ్రద్ధ వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న యువకుడే చంపి ముక్కలుగా కోసి ఫ్రిజ్లో దాచిపెట్టి, ఆ శరీర భాగాలను నగరమంతా చల్లిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మరో కేసు కూడా ఢిల్లీలోనే వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఓ తల్లి కొడుకులు కలిసి ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిజ్లో దాచిపెట్టారు. ఆ తర్వాత వాటిని ఇద్దరూ కలిసి అక్కడక్కడా పడేశారు. ఈ నేరం వెలుగులోకి రావడంతో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ తల్లి కొడుకులు ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో వారు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. 

మృతుడు అంజన్ దాస్ ను అతని భార్య పూనమ్, సవతి  కొడుకు  దీపక్ లు కలిసి హత్య చేశారు. వీరి విచారణలో పూనమ్ ఈ హత్యకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టింది. పూనమ్ కు అంజన్ దాస్ కంటే ముందే మరో ఇద్దరితో పెళ్లయింది. పూనమ్ స్వస్థలం జార్ఖండ్లోని దేవగడ్. పూనమ్ కు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మొదటి వివాహం జరిగింది. అతని పేరు సుఖ్ దేవ్ తివారీ. బీహార్ నివాసి. వీరి వివాహం ద్వారా ఆమె ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. పెళ్లయిన ఏడాది తర్వాత సుఖ్ దేవ్ పని కోసం ఢిల్లీకి వెళ్ళాడు.  అలా వెళ్లిన అతను తిరిగి రాలేదు. భర్తను వెతుక్కుంటూ పూనమ్ 1997లో తన కుమార్తెతో కలిసి ఢిల్లీకి వచ్చింది. భర్త సుఖ్ దేవ్ తివారీ గురించి అన్ని చోట్లా వెతికింది. అతని ఆచూకీ ఎక్కడా దొరకలేదు. 

పదవ తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ : పోర్న్ వీడియోలు చూపి, అందులో ఉన్నట్లు చేయాలని అత్యాచారం...

ఇంతలో పూనమ్ కు కల్లుతో పరిచయమైంది. కల్లు త్రిలోక్ పుర్ నివాసి. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి సహజీవనం ప్రారంభించారు. పూనమ్ కు కల్లుతో ఉన్న సంబంధంతో వీరికి ఒక కొడుకు దీపక్..  ఇదేనే హత్య కేసులో సహ నిందితుడు,  ఇద్దరు కూతుర్లు  జన్మించారు. ఆ తర్వాత మద్యానికి బానిసైన కల్లు  తీవ్రంగా ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. 2011లో పూనమ్ కు అంజన్ దాస్ తో పరిచయం ఏర్పడింది. అంజన్ దాస్ తన ఇంటిపై అంతస్తులోనే నివసించేవాడు. లివర్ ఫెయిల్ అవ్వడంతో 2016లో కల్లు  చనిపోయాడు. ఆ తర్వాత పూనమ్ పూర్తిగా  అంజన్ దాస్ తో కలిసి జీవించడం ప్రారంభించింది.

అయితే, అప్పటికే అంజన్ దాస్ కు వివాహం అయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. పూనమ్ తో సహజీవనం మొదలు పెట్టిన తర్వాత అంజన్ దాస్ పూర్తిగా పని మానేసి ఆమె మీదనే ఆధారపడేవాడు. అంతటితో ఆగకుండా పూనమ్ ఇంట్లో నగలు, డబ్బు దొంగిలించి బీహార్ లో ఉన్న తన మొదటి భార్య, పిల్లలకు పంపిస్తుండేవాడు. ఇది పూనమ్ కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. కాగా, 2018లో పూనమ్ కొడుకు దీపక్ పెళ్లి అయింది. భార్యతో కలిసి దగ్గర్లోనే మరో ఇంట్లో కాపురం పెట్టాడు. 

అయితే, ఇంట్లో ఉంటున్న తన కూతురి మీద, దీపక్ భార్య మీద అంజన్ దాస్ కన్ను పడినట్లు పూనమ్ గ్రహించింది. ఇద్దరి పైన కూడా అంజన్ దాస్ అత్యాచారానికి ప్రయత్నించాడు అని తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లీ, కొడుకులు అంజన్ దాస్ ను ఎలాగైనా హత్య చేయాలని అనుకున్నారు. దీని కోసం అంజన్ దాస్ కు మద్యం తాగించారు. ఆ తర్వాత హత్య చేశారు. చనిపోయాక అతడిని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిజ్లో పెట్టి నగరంలోని రకరకాల ప్రదేశాల్లో విసిరేశారు. చివరికి పోలీసులకు దొరికిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios