Asianet News TeluguAsianet News Telugu

రూ. 1.90 కోట్ల బీమా సొమ్ము కోసం క‌ట్టుకున్న భార్యను క‌డ‌తేర్చిన భ‌ర్త

Jaipur: ఒక వ్యక్తి ₹ 1.90 కోట్ల బీమా సొమ్ము కోసం క‌ట్టుకున్న‌ భార్యను చంపాడు. అంత‌కు మందు రోడ్డు ప్ర‌మాదంగా దీనిని భావించిన‌ప్ప‌టికీ.. పోలీసుల విచార‌ణ‌లో బీమా సొమ్ము కోసమే తన భార్యను హత్య చేసేందుకు నిందితుడు కుట్ర పన్నాడని తేలింది.
 

Rajasthan : Husband who killed his wife for 1.90 crores insurance money
Author
First Published Dec 1, 2022, 4:55 AM IST

Rajasthan: ఒక వ్యక్తి ₹1.90 కోట్ల బీమా సొమ్ము కోసం క‌ట్టుకున్న‌ భార్యను చంపాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న రాజ‌స్థాన్ లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. ఒక వ్యక్తి ₹ 1.90 కోట్ల బీమా మొత్తాన్ని పొందడం కోసం రౌడీ-షీటర్‌ని నియమించి తన భార్యను చంపాడని పోలీసులు తెలిపారు. త‌న బంధువుతో క‌లిసి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా, వారిని కారుతో ఢీ కొట్టించి వారి ప్రాణాలు తీశాడు. ఎవ‌రికీ అనుమానం రాకుండా ఉండేందుకు రోడ్డు ప్ర‌మాదంగా చిత్రీక‌రించేందుకు కుట్ర ప‌న్నాడు. అక్టోబరు 5న తన భర్త మహేష్ చంద్ అభ్యర్థన మేరకు షాలు తన బంధువైన రాజుతో కలిసి మోటార్‌సైకిల్‌పై ఆలయానికి వెళుతుండగా, తెల్లవారుజామున 4.45 గంటల ప్రాంతంలో ఎస్‌యూవీ వారి వాహనాన్ని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె బంధువు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

ఇది రోడ్డు ప్రమాదంగా అనిపించినప్ప‌టీకి.. పోలీసుల‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఈ ఘ‌ట‌న‌పై  అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు త‌మ‌దైన త‌ర‌హాలో విచార‌ణ జ‌ర‌ప‌గా, ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే చంద్ తన భార్యను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) వందిత రాణా బుధవారం మాట్లాడుతూ, చంద్ 40 సంవత్సరాల కాలానికి షాలు బీమా పొందారని చెప్పారు. సహజ మరణంపై బీమా మొత్తం ₹ 1 కోటి, ప్రమాదంలో మరణిస్తే ₹ 1.90 కోట్లు అని అధికారి తెలిపారు. షాలుని చంపడానికి రౌడీ షీటర్ ముఖేష్ సింగ్ రాథోడ్‌తో చంద్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాథోడ్ ఈ ప‌నిచేయ‌డానికి ₹ 10 లక్షలు డిమాండ్ చేసాడు. ఈ క్ర‌మంలోనే ముందుగా ₹ 5.5 లక్షలు ఇచ్చాడు. ఆ త‌ర్వాత వారిని రోడ్డు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయేలా చేశారు. ఈ పని కోసం రాథోడ్ ఇతర వ్యక్తులను త‌న‌తో  చేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు.

షాలు 2015లో చంద్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. అయితే పెళ్లయిన రెండేళ్ల తర్వాత వారిద్దరి మధ్య గొడవలు జరగడంతో ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో నివాసం ఉండడం ప్రారంభించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె 2019లో గృహ హింస కేసు కూడా నమోదు చేసింది. చంద్ షాలుకి ఇటీవల బీమా చేయబడింది. ఆ తర్వాత తాను ఒక కోరిక కోరుకున్నాన‌నీ, అది నెరవేరాలంటే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా వరుసగా 11 రోజుల పాటు మోటార్‌సైకిల్‌పై హనుమాన్ ఆలయానికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పాడని పోలీసులు తెలిపారు. తన కోరిక నెరవేరగానే ఆమెను ఇంటికి చేర్చుకుంటానని కూడా చెప్పాడు. దీంతో మోటారు సైకిల్‌పై బంధువుతో కలిసి గుడికి వెళ్లడం ప్రారంభించిందని తెలిపారు. అక్టోబరు 5న షాలు, రాజు గుడికి వెళుతుండగా రాథోడ్ మరో ముగ్గురితో కలిసి ఎస్‌యూవీలో వారిని వెంబడించి వారి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టారని, చంద్ మోటార్‌సైకిల్‌పై ఎస్‌యూవీని అనుసరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన తర్వాత అతను అక్కడి నుంచి తిరిగొచ్చినట్లు వారు తెలిపారు. రాథోడ్‌తో పాటు మరో ఇద్దరు ఎస్‌యూవీ యజమాని రాకేష్ సింగ్, సోనూలను కూడా అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios