ఈ దేశంలో బతకాలంటే ‘భారత్ మాతాకీ జై’ అనాల్సిందే - కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి

భారత్ మాతాకీ జై అని నినదించే వారే ఈ దేశంలో ఉండాలని కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి అన్నారు. ఇతర దేశాలపై విశ్వాసం ఉన్నవారు అక్కడికి వెళ్లిపోవాలని సూచించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ప్రాముఖ్యత ఇస్తుందని అన్నారు.

To live in this country, you have to say 'Bharat Mataki Jai' - Union Minister Kailash Chaudhary..ISR

మన దేశంలో నివసించాలనుకునే వారు భారత్ మాతాకీ జై అనాల్సిందే అని బీజేపీ నేత, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి చౌదరి కైలాశ్ చౌదరి అన్నారు. శనివారం హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన రైతు సదస్సులో వ్యవసాయ శాఖ సహాయ మంత్రి చౌదరి మాట్లాడారు. తెలంగాణలో జాతీయవాద ఆలోచనతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని చెప్పారు.భారత్ మాతాకీ జై అని నినదించబోమని భారత్ లో చెప్పేవారికి నరకం తప్పదని ఆయన కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి తెలిపారు. ‘భారత్ మే రెహనా హై, తో 'భారత్ మాతాకీ జై' బోల్నా హోగా (మీరు భారతదేశంలో జీవించాలనుకుంటే, మీరు 'భారత్ మాతాకీ జై' అనాలి) అని ఆయన తేల్చిచెప్పారు.

కొనసాగుతున్న ఆపరేషన్ అజయ్.. 274 మందితో ఢిల్లీకి చేరుకున్న నాలుగో విమానం..

భారత్ లో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అంటారా అని ప్రశ్నించారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అనుకునే వారికే దేశంలో స్థానం ఉందని తెలిపారు. ‘‘అందుకే నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, 'భారత్ మాతాకీ జై' అనని, హిందూస్థాన్, భారత్ లపై నమ్మకం లేని, 'పాకిస్తాన్ జిందాబాద్'పై విశ్వాసం ఉంచేవారు పాకిస్తాన్ కు వెళ్లిపోవాలి. ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. ఈ ప్రాంతంలో జాతీయవాద భావజాలం ఉండాల్సిన అవసరం ఉందని, సమిష్టి కృషితో దేశాన్ని బలోపేతం చేయాలని తెలిపారు.

 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించిన కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన సందర్భంగా బీజేపీ రైతు సదస్సును నిర్వహించింది. ప్రతిపక్ష కూటమికి ఐఎన్ డీఐఏ అని నామకరణం చేయడాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ వారు మొదట మహాత్మా గాంధీ పేరును దొంగిలించారని, ఆ తర్వాత వారు దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి ఏర్పడిన ‘‘కాంగ్రెస్’’ పేరును తీసుకున్నారని చౌదరి ఆరోపించారు.

ఇజ్రాయెల్ ప్రధాని ఒక దెయ్యం.. గాజాకు ప్రధాని మోడీ అండగా నిలవాలి - అసదుద్దీన్ ఒవైసీ..

‘‘ప్రతిపక్ష కూటమికి  వారు ఇండియా అని పేరు పెట్టారు. కానీ, పేర్లను దొంగిలించే ఈ పని ఇప్పుడే కొత్తగా ఏం జరగలేదు. కాంగ్రెస్ వాళ్లు మొదట మహాత్మాగాంధీ పేరును దొంగిలించారు. ఈ రోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. గాంధీని దొంగిలించడం ద్వారా వారు గాంధీజీలా మారాలనుకుంటున్నారు. అదే విధంగా భారత్ పేరును కూడా చెడగొట్టాలని చూస్తున్నారు’’ అని చూస్తున్నారు.

దారుణం.. కూతురును తరచూ కొడుతోందని.. ఏడేళ్ల మేనకోడలి హత్య..

బ్రిటీష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం రావడానికే కాంగ్రెస్ ఆవిర్భవించిందని, స్వాతంత్య్రోద్యమం తర్వాత కాంగ్రెస్ శాశ్వతంగా అంతమవుతుందని మహాత్మాగాంధీ చెప్పారని కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చేసిన దుర్మార్గాలను కప్పిపుచ్చుకునేందుకే ‘ఇండియా’ అని పేరు పెట్టారని చెప్పారు. కానీ వారి అవినీతి గురించి చరిత్ర చెబుతోందని, దానిని దాచలేమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడూ రైతులకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్ పెంపు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం, నానో యూరియా ఎరువులు, అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏర్పాటుతో వంటి అనేక రైతు అనుకూల చర్యలు తీసుకుందని చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios