అయోధ్య రాములోరి పూజారిగా తిరుపతి వేద విద్యాలయం విద్యార్థి...

ఘజియాబాద్‌లోని దూధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌లో మోహిత్ పాండే పదవ తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత, 2020-21 విద్యా సంవత్సరంలో ఎస్ వివియూలో బీఏ (శాస్త్రి) కోర్సులో చేరాడు.

Tirupati Venkateswara Vedic University scholar select as priest of ayodhya ram mandir - bsb

అయోధ్య : ప్రస్తుతం తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం (ఎస్వీవీయూ)లో ఎంఏ (ఆచార్య) కోర్సును అభ్యసిస్తున్న మోహిత్ పాండే అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. మోహిత్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన వ్యక్తి, రామాలయం అర్చకుల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 3,000 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. వీరందరిలో 200 మంది షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో 50 మందిని ఎంపిక చేశారు. అందులో పాండే ఎంపికయ్యారు. మోహిత్ పాండే పూజారిగా బాధ్యతలు తీసుకునే ముందు ఆరు నెలల శిక్షణను పొందుతున్నాడు.

“మా విద్యార్థి అయోధ్య రామ మందిరంలో పూజారిగా ఎంపిక కావడం మాకు చాలా గర్వకారణం. అతనికి 10 సంవత్సరాల పాటు ఇక్కడ శిక్షణ ఇచ్చాం”అని మహంత్ నారాయణ్ గిరి అన్నారు. మహంత్ నారాయణ్ గిరి దూధేశ్వర్ నాథ్ ఆలయ ప్రధాన పూజారి, దూధేశ్వర్ వేద్ విద్యాలయ ప్రధాన పోషకుడు.

అయోధ్య రాముడి కోసం 108 అడుగుల బాహుబలి అగర్బత్తి..

మోహిత్ పాండే ఎవరు?
ఘజియాబాద్‌లోని దూధేశ్వర్ వేద్ విద్యాపీఠ్‌లో మోహిత్ పాండే పదవ తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత, 2020-21 విద్యా సంవత్సరంలో ఎస్ వివియూలో బీఏ (శాస్త్రి) కోర్సులో చేరాడు. మోహిత్ పాండే వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఆచార్య డిగ్రీ అయిపోయిన తరువాత మోహిత్ పాండే పీహెచ్ డీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మోహిత్ గత ఏడు సంవత్సరాలుగా దూధేశ్వర్ వేద్ విద్యాపీఠంలో మతం, ఆచారాలను అధ్యయనం చేశాడు. గత 23 సంవత్సరాలుగా, విద్యార్థులు ఈ ప్రదేశంలో వేద బోధనను స్వీకరిస్తున్నారు.

ఘజియాబాద్ నుండి తిరుపతికి,  ఇప్పుడు అయోధ్యకు పాండే ప్రయాణం అతని అంకితభావానికి, కఠినమైన శిక్షణకు నిదర్శనం. మోహిత్ పాండే ఎంపిక ఆధ్యాత్మిక సామర్థ్యాలలో సేవ చేయడానికి అర్హతగల వ్యక్తులను తయారు చేయడంలో ఎస్ వివియూ వంటి విద్యాసంస్థలు పోషించిన కీలక పాత్రను నొక్కి చెబుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios