Asianet News TeluguAsianet News Telugu

టిప్పు సుల్తాన్ బీజేపీని చికాకు పెడుతున్నాడు - ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ..

టిప్పు సుల్తాన్ బీజేపీని చికాకు పెడుతున్నాడని అందుకే మైసూర్ పాలకుడి పేరు మీద ఉన్న రైలు పేరు మార్చిందని ఏఐఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరును తప్పుబట్టారు. 

Tipu Sultan is irritating BJP - AIMIM chief Asaduddin Owaisi..
Author
First Published Oct 9, 2022, 12:58 PM IST

టిప్పు ఎక్స్‌ప్రెస్ పేరును వడయార్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చడంపై కేంద్ర ప్రభుత్వంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం మండిపడ్డారు. టిప్పు సుల్తాన్ అంటే ఇష్టం లేకనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో విద్యుదాఘాతంతో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం

‘‘ టిప్పు సుల్తాన్ బీజేపీని చికాకు పెడుతున్నాడు. అయితే ఆ పార్టీ అతడి వారసత్వాన్ని ఎప్పటికీ చెరిపివేయలేదు ’’ అని అసదుద్దీన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. బీజేపీ ప్రభుత్వం టిప్పు ఎక్స్‌ప్రెస్ పేరును వడయార్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చిందని అన్నారు. ‘‘ టిప్పుపై బీజేపీ భగ్గుమంది. ఎందుకంటే టిప్పు బ్రిటీష్ ప్రభువులపై మూడు యుద్ధాలు చేశాడు. రైలు పేరును బీజేపీ మార్చినా టిప్పు వారసత్వాన్ని ఎప్పటికీ తుడిచిపెట్టలేదు’’ అన్నారు.

గ‌త శుక్ర‌వారం రైల్వేశాఖ మైసూర్ పాలకుడి పేరు మీద ఉన్న రైలు టిప్పు సూపర్‌ఫాస్ట్ పేరును వడయార్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చింది. ఈ రైలు పేరు మార్పుపై కర్ణాటకలో రాజకీయ దుమారం చెలరేగింది. సమాజంలో విద్వేషాలు పెంచేందుకు బీజేపీ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ రైలు పేరు మార్చాలంటూ మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా రైల్వే శాఖకు జూలైలో లేఖ రాయడంతో రైల్వే శాఖ ఈ నిర్ణ‌యం తీసుకుంది.  ఆయ‌న రైల్వే మంత్రికి చేసిన విజ్ఞప్తిలో.. వడయార్లు తమ రాజ్యంలో రైల్వే మౌలిక సదుపాయాలకు విపరీతంగా సహకరించార‌ని పేర్కొన్నారు.

మ‌రోసారి డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్.. రెండోసారి ఏకగ్రీవం

రాష్ట్ర కవి కువెంపు గౌరవార్థం మైసూరు, తలగుప్పె మధ్య ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌కు పేరు పెట్టాలని ప్ర‌తాప్ సింహా ఆ లేఖ‌లో అభ్యర్థించారు. ఈ సూచ‌న‌ను కూడా రైల్వేశాఖ ఆమోదించింది. ఉత్త‌ర్వులు జారీ చేసింది.  దీంతో శ‌నివారం నుంచి ఆ రెండు రైళ్ల పేర్లు అధికారికంగా మారాయి. 

1980లో ప్రారంభించిన 12613 మైసూరు-బెంగళూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ 'టిప్పు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్'గా నడుస్తోంది. సింగిల్-లైన్ మీటర్ గేజ్ ట్రాక్‌లో రైలు 139 కి.మీ దూరాన్ని మూడు గంటల కంటే తక్కువ వ్యవధిలో కవర్ చేస్తుంది. అయితే ఇప్పుడు దాని పేరు వడయార్ ఎక్స్‌ప్రెస్‌గా మారింది. దీంతో మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా రైల్వే మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

న్యూఢిల్లీలో కాల్పుల కలకలం: షోరూమ్ వెలుపల గాల్లోకి కాల్పులకు దిగిన దుండగుడు

అయితే ముస్లిం రాజు పేరుపై ఉన్న రైలును హిందూ రాజవంశం పేరుపైకి మార్చ‌డం ప‌ట్ల కొన్ని వ‌ర్గాల నుంచి అధికార బీజేపీ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కాషాయీకరణ ఎజెండాగానే ఇవి జ‌రుగుతున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. కాగా.. ప్రస్తుత కర్ణాటకలోని పూర్వపు మైసూర్ రాజ్యానికి వడయార్లు హిందూ పాలకులుగా ఉండగా, టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్టణానికి ముస్లిం పాలకుడు. ఆయ‌న బ్రిటిష్ పాల‌కుల‌తో పోరాడి మరణించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios