మద్రాస్ యూనివర్సిటీలో పౌరసత్వ సెగ: కమల్ హాసన్‌ను అడ్డుకున్న సిబ్బంది
మద్రాస్ యూనివర్సిటీలో హైడ్రామా చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ విద్యార్ధులకు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వెళ్లారు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై ఇప్పటికే ఈశాన్య భారతం దద్దరిల్లుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇది దక్షిణాదికి కూడా పాకింది. బుధవారం సాయంత్రం మద్రాస్ యూనివర్సిటీలో హైడ్రామా చోటు చేసుకుంది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ విద్యార్ధులకు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వెళ్లారు. అయితే ఆయనను వర్సిటీ క్యాంపస్‌లోకి అడుగు పెట్టనీయకుండా సిబ్బంది అడ్డుకున్నారు.
Also Read:పౌరసత్వ చట్టం... ముస్లింలకు ఏమీకాదు.. షాహీ ఇమామ్
మెయిన్ గేట్‌కి తాళం వేయడంతో కీ ఇవ్వాలని కమల్ హాసన్ కోరారు.. అది తమ వద్ద లేదని అధికారుల దగ్గర వుందని సిబ్బంది సమాధానం ఇచ్చారు.
మరోవైపు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన హింసాకాండలో విద్యార్ధులను మినహాయించి 14 మంది స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు ఇద్దరు మైనర్లు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Also Read:జామియా మిలియా విద్యార్ధులపై లాఠీఛార్జీ: భగ్గుమన్న అసదుద్దీన్
జామియా వర్సిటీ ఘటనలో పోలీసులు దుశ్చర్చకు పాల్పడ్డారని వస్తున్న ఆరోపణలను ఓ పోలీసు అధికారి ఖండించారు. విద్యార్ధులపై బలప్రయోగం, క్యాంపస్‌లోకి చొచ్చుకెళ్లడం అనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఓ గుంపు లోపలికి వెళ్లిన తర్వాతే పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించారని ఆయన వెల్లడించారు.