ఢిల్లీలోని మూడు అంతస్తుల భవనం ఆదివారం తెల్లవారుజామున కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో ఓ మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు.ర మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో మంకీపాక్స్ కలకలం.. భారత్‌లో 4కు చేరిన కేసుల సంఖ్య
ఈ ఘటనకు సంబంధించిన నివేదికల ప్రకారం.. ముస్తఫాబాద్‌లోని బాబు నగర్ చనే వలీ గాలి వద్ద ఉన్న మూడొంతస్తుల భవనం ఉదయం 5 గంటల ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అందులో ఉన్న వారికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే భవనం కూలిపోవడానికి కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ఇల్లు కూలిన సమాచారం వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖకు అందింది. దీంతో మూడు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
మీడియాకు ఆత్మపరిశీలన అసవరం.. సీజేఐ వ్యాఖ్యలను సమర్థించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
అగ్నిమాపక శాఖ అధికారులు శిథిలాల నుండి నలుగురిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రక్షించిన నలుగురిలో ఒకరు తీవ్ర గాయాలతో మరణించగా.. మిగిలిన ముగ్గురు చికిత్స ప్రస్తుతం పొందుతున్నారు.
ఇదిలా ఉండగా.. నిన్న కూడా వరంగల్ లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తాజాగా కురుస్తున్న వల్ల ఓ పాత భవనం కూలిపోయింది. మండి బజార్ లో ఇది చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రెస్క్యూ టీం తో అక్కడికి చేరుకున్నారు. భవన శిథిలాల నుంచి వారిని వెలికితీశారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. వర్షాల వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. పాత భవనాల్లో ఉండే వారు సురక్షిత ప్రాంతంలో ఉండాలని సూచించారు.
క్యాండిల్ తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 8 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం..
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మహారాష్ట్రలోని పూణే లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎరవాడ ప్రాంతంలో శాస్త్రినగర్ నిర్మిస్తున్న ఓ భవనం ఒక్క సారిగా కూలిపోయింది. దాని బేస్‌మెంట్ లెవల్‌లో స్లాబ్‌ను కట్టేందుకు స్టీల్ కడ్డీలతో ఓ నిర్మాణం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో అక్కడ పని చేస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
