కర్ణాటక రాష్ట్రంలోని ఓ కొవ్వొత్తుల తయారీ ఫాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. వారు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని ఓ ఫాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. అయితే ఈ ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. విజయవంతంగా మంటలను ఆర్పివేశారు.
Covid Cases in India: దేశంలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
ఈ ఘటనపై వెలువడిన నివేదికల ప్రకారం.. ధార్వాడ్ జిల్లాలోని హుబ్బళ్లిలోని స్పార్కెల్ క్యాండిల్ తయారీ కర్మాగారం ఆవరణలో శనివారం సాయంత్రం మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. హుటా హుటిన ఫైర్ ఇంజన్లు అగ్నిప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఈ మంటలను చల్లార్చడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు ప్రయత్నించారు. అలాగే ఫాక్టరీ లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు.
సంఘటనా స్థలంలో ఉన్న ధార్వాడ్ జిల్లా కలెక్టర్ గురుదత్త హెగ్డే మీడియాతో మాట్లాడారు. ‘‘ తారిహాల్ పారిశ్రామిక ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. 8 మందికి కాలిన గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మేము మెటీరియల్‌ని యాక్సెస్ చేస్తున్నాము. ఫ్యాక్టరీ, దాని యజమాని అక్రమాలకు సంబంధించి విచారణ చేస్తున్నాము. మంటలు చెలరేగడానికి గల అసలు కారణాలు ఏంటనే విషయం ఇంకా తెలియరాలేదు ’’ అని ఆయన అన్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ జరుగుతోంది.
