సెక్స్‌ రాకెట్: కండోమ్‌లు దాచి బ్లాక్ మెయిల్

Three arrested for involvement in `sex racket'
Highlights

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో నివాస ప్రాంతంలో ఇంజనీరింగ్ విద్యార్ధులమంటూ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో విటులను బుక్ చేసుకొని ఈ దందా నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. 


భోపాల్:ఇంజనీరింగ్ విద్యార్ధుల పేరుతో  వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పోలీసులు వలపన్ని పట్టుకొన్నారు.  ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో చోటు చేసుకొంది.  భోపాల్ నగరంలోని నివాస ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

భోపాల్ నగరంలోని  షహపురా ప్రాంతంలో దిలీప్ గోయల్, అర్జున్‌పాల్ ‌లు అనే ఇద్దరు యువకులు  ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని  అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.ఆన్‌లైన్‌  లో విటులను బుక్ చేసుకొంటున్నారు. 

రాజస్థాన్ రైఫిల్స్‌లో పనిచేసిన దిలీప్ గోయల్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరుగురు ఏజంట్లను పెట్టుకొని అమ్మాయిలతో సెక్స్ రాకెట్ నడుపుతున్నాడు.  విటుల వద్దకు  అమ్మాయిలను పంపుతూ వారి నుండి వేలాది రూపాయాలను  లాగుతున్నాడు.  అంతేకాదు  బాగా డబ్బులున్న విటులను బ్లాక్ మెయిల్‌ చేసేవాడు.

బాగా డబ్బులున్న విటులు ఉపయోగించిన కండోమ‌్‌ను దాచిపెట్టి వారిని బ్లాక్‌మెయిల్‌‌కు పాల్పడేవాడు. ఈ రకంగా పెద్ద మొత్తంలో   డబ్బులు లాగుతున్నట్టు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.  ఢిల్లీ, గ్వాలియర్, ముంబై నగరాలకు చెందిన 19 నుండి 23 ఏళ్ల వయస్సు గల అమ్మాయిలతో  దిలీప్ గోయల్  వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. 

అమ్మాయిలను మహిళా సదనానికి తరలించారు.  సెక్స్ రాకెట్‌ సూత్రధారులైన దిలీప్‌గోయల్, అర్జున్‌పాల్ తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు.
 

loader