ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు మౌలానా తౌకీర్ రజా మరో వివాదాస్పద ప్రకటన తెరపైకి వచ్చింది. హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేసేవారిని వ్యతిరేకిస్తూ, హిందూ రాష్ట్రాన్ని డిమాండ్ చేయడం సరైనదే అయితే, ఖలిస్తాన్ డిమాండ్ చేసేవారు కూడా న్యాయమేనని అన్నారు.
మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు మౌలానా తౌకీర్ రజాఖాన్ వార్తల్లో నిలిచారు. భారత్ ను హిందూ దేశంగా మార్చాలనే వారిపై దేశద్రోహం కింద కేసులు పెట్టాలన్నారు. భారత్ ను హిందూదేశంగా మార్చాలనే డిమాండ్ ఆమోదయోగ్యమైనదైతే.. ఖలిస్తాన్ లేదా ప్రత్యేక ముస్లిం రాష్ట్రం డిమాండ్ కూడా ఆమోదయోగ్యమైనదని ఆయన పేర్కొన్నారు. ముస్లిం యువకులు ప్రత్యేక ముస్లిం రాష్ట్రాన్ని డిమాండ్ చేయడం ప్రారంభిస్తే ఏమి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. తాము దేశ విభజనను అనుమతించబోమని మౌలానా తౌకీర్ రజా ఖాన్ అన్నారు.
ఇంతలో ఆయన ప్రధానినరేంద్ర మోదీపై కూడాఅభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాని మోదీని ధృతరాష్ట్రుడిగా అభివర్ణించారు. ముస్లింలను చంపిన వారికి, ఇస్లాంను వ్యతిరేకించిన వారికి మోదీ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ఆరోపించారు. అలాగే.. దాదాపు 10 లక్షల మంది ముస్లిం బాలికలను హిందూ సంస్థలు ప్రలోభపెట్టి బలవంతంగా హిందూ మతంలోకి మార్చాయని ఆరోపించారు.
హిందూ దేశం గురించి మాట్లాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, ఖలిస్తాన్ గురించి మాట్లాడే వ్యక్తులపై ఎందుకు విచారణ చేస్తున్నారు?" అతను అడిగాడు. హిందూ దేశం గురించి మాట్లాడే వారిపై దేశద్రోహ చట్టం కింద కేసు పెట్టాలనీ, లేని పక్షంలో హిందూ దేశ వాదులు ద్వేషాన్ని, సమస్యలను విస్తరింపజేస్తారని అన్నారు. అలాగే..ముస్లిం సమాజం ప్రత్యేక ముస్లిం దేశం గురించి మాట్లాడటం మొదలు పెడుతుందని మౌలానా తౌకీర్ రజా ఖాన్ అన్నారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని సహించేది లేదని తౌకీర్‌రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మౌలానా తౌకీర్ రజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బీజేపీ అనుబంధ సంస్థలైన విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), భజరంగ్ దళ్ లను లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) మాదిరిగానే నిషేధించాలని ఖాన్ డిమాండ్ చేశారు.
