Asianet News TeluguAsianet News Telugu

జేపీ సిద్ధాంతాలను మ‌రిచిన వారిని గ‌ద్దె దించాలి - బీహార్‌ మహాఘట్‌బంధన్ ప్ర‌భుత్వంపై అమిత్ షా ఫైర్

జయప్రకాశ్ నారాయణ్ సిద్ధాంతాలు, ఉద్యమాల ద్వారా పేరు సంపాదించుకున్న నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ తో జత కట్టారని కేంద్ర హోం మంత్రి అన్నారు. వారిని అధికారం నుంచి ప్రజలే గద్దె దించుతారని చెప్పారు. 

Those who have forgotten JP's principles should be ousted - Amit Shah fires on Bihar Mahaghatbandhan government
Author
First Published Oct 11, 2022, 5:22 PM IST

బీహార్‌లో సోషలిస్ట్ దిగ్గజం జయప్రకాశ్ నారాయణ్ 15 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని హోంమంత్రి అమిత్ మంగళవారం షా ఆవిష్కరించారు. జేపీ 120వ జయంతిని పురస్కరించుకుని సరన్ జిల్లాలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో అమిత్ షా మాట్లాడారు. మహాఘట్‌బంధన్ ప్ర‌భుత్వంపై పెద్దఎత్తున విరుచుకుపడ్డారు. 

బస్టాండ్‌లో విద్యార్థుల పెళ్లి.. స్కూల్ విద్యార్థినికి తాళి కట్టిన కాలేజ్ విద్యార్థి.. వీడియో వైరల్ కావడంతో..

జేపీ పేరు చెప్పుకుని గెలిచి, ఆయ‌న సిద్ధాంతాలకు విరుద్ధంగా పని చేసే వారితోనే చేతులు క‌లిపిన సీఎంను అతి త్వ‌ర‌లో గ‌ద్దె దించాల‌ని అన్నారు. జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ్ ఇందిరాగాంధీకి చెమ‌ట‌లు ప‌ట్టించార‌ని అన్నారు. 70వ దశకంలో ఎమర్జెన్సీకి విధించిన తాగుబోతు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయ‌న భారీ ఆందోళ‌న చేప‌ట్టార‌ని అన్నారు. గుజ‌రాత్ లో 1973లో కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలోని ప్ర‌భుత్వంలో చిమన్ పటేల్ సీఎంగా ఉన్నార‌ని తెలిపారు. అయితే ఆ స‌మ‌యంలో ఇందిరా గాంధీ ప్రభుత్వాలకు బహిరంగంగా డబ్బు వసూలు చేసే పని ఇచ్చింద‌ని ఆరోపించారు. దీంతో అవినీతి మొద‌లైంద‌ని తెలిపారు. దీనికి వ్య‌త‌రేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశార‌ని, ఇది జ‌య‌ప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జరిగింద‌ని చెప్పారు. ఈ నిర‌స‌న‌లు గుజ‌రాత్ లో ప్ర‌భుత్వాన్ని మార్చింద‌ని పేర్కొన్నారు.

న‌న్ను దూషించే ప‌నిని కాంగ్రెస్ మ‌రొక‌రికి కాంట్రాక్ట్ ఇచ్చేసింది - ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ..

దేశ స్వాతంత్య్రంలో జేపీ కీలక పాత్ర పోషించారని అమిత్ షా అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా జేపీ ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి దేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ‘‘ 70వ దశకంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన అవినీతి, అధికార పీడిత ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా జయప్రకాశ్ భారీ ఉద్యమం చేశారు. ఆయ‌న జీవితం అంతా భూమిలేని, నిరుపేద‌లు, అణగారిన, వెనుకబడిన వ‌ర్గాల కోసం వెచ్చించారు. ’’ అని కొనియాడారు. 

జేపీ ఉద్య‌మం ద్వారా ఔన్న‌త్యాన్ని సాధించిన నాయ‌కులు నేడు అధికారం కోసం కాంగ్రెస్ ఒడిలో కూర్చున్నార‌ని అమిత్ షా విమ‌ర్శించారు. జ‌యప్ర‌కాశ్ నారాయ‌ణ్ అధికారం కోసం ఎప్పుడూ పాకులాడ‌లేద‌ని, ఆయ‌న జీవితం మొత్తం సిద్ధాంతాల కోస‌మే ధార‌బోశార‌ని చెప్పారు. కానీ కొంద‌రు ఇప్పుడు అధికారం కోసం ప‌క్క‌కి మారార‌ని నితిష్ కుమార్ ను ఉద్దేశించి అమిత్ షా అన్నారు.

నాడు తండ్రి.. నేడు త‌న‌యుడు.. 37 యేండ్ల‌ తర్వాత తండ్రి స్థానంలో చంద్రచూడ్ భాధ్య‌త‌లు .. చారిత్రాత్మక తీర్పులు

కాగా.. బీహార్ లో ఎన్డీఏ ప్ర‌భుత్వం అధికారం కోల్పోయిన త‌రువాత ఆ రాష్ట్రంలో అమిత్ షా ప‌ర్య‌టించ‌డం ఇది రెండో సారి. అంతకుముందు ఆయన సెప్టెంబర్ 23వ తేదీన సీమాంచల్ ప్రాంతంలోని పూర్నియా, కిషన్‌గంజ్‌లను సందర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios