ఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో 200 మంది పర్యాటకుల మరణాలు
ఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో 200 మంది మరణించినట్టు ఉత్తరాఖండ్ స్టేట్ ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ వెల్లడించింది. ఇందులో ఆరోగ్యపరమైన కారణాల కంటే కూడా జారుడు బండల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణించినట్టు వివరించింది.

న్యూఢిల్లీ: ఈ ఏడాది చార్ ధామ్ యత్రలో 200 మంది పర్యాటకులు మరణించారు. ఇందులో చాలా వరకు జారుడు బండల వల్ల జరిగిన ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మరణించారు. ఆ తర్వాతే ఆరోగ్య కారణాలతో మరణించిన వారి సంఖ్య ఉన్నది. 200 మంది మరణాలు్లో 96 మంది కేదార్ నాథ్ ధామ్ మార్గంలో మరణించినట్టు ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ వెల్లడించింది. కాగా, యమునోత్రి ధామ్ మార్గంలో 34 మంది, బద్రినాథ్ ధామ్ మార్గంలో 33 మంది, గంగోత్రి ధామ్ మార్గంలో 27 మంది, హేమకుండ్ సాహిబ్‌లో ఏడుగురు, గౌముఖ్ ట్రెక్కింగ్‌లో మరొకరు మరణించినట్టు తెలిపింది.
చార్ ధామ్ యాత్రికుల సంఖ్య 4.19 మిలియన్లు దాటింది. ఇందులో కేదార్ నాథ్ యాత్రికుల సంఖ్య 1.34 మిలియన్ల సంఖ్యను దాటింది.
అయితే, ఈ ఏడాది చార్ ధామ్ యాత్రికుల మరణాల సంఖ్య తగ్గినట్టు తెలుస్తున్నది. గతేడాది సెప్టెంబర్ 11వ తేదీ వరకు చార్ ధామ్ యాత్రికుల మరణాల సంఖ్య 232గా ఉన్నది. 111 మంది కేదార్ నాథ్ ధామ్‌లో 58 మంది బద్రినాథ్ ధామ్ మార్గంలో మరణించారని వివరించింది. హేమకుండ్ సాహిబ్‌లో నలుగురు, గంగోత్రిలో 15 మంది, యమునోత్రి ధామ్‌లో 44 మంది మరణించినట్టు పేర్కొంది. గతేడాది మొత్తం పీరియడ్‌లో యాత్రికుల మరణాలు సుమారు 300గా ఉన్నాయి.
Also Read: ట్రైన్‌లో ఘరానా చోరీ.. రైలు కదలగానే గన్‌లు తీసి బెదిరింపులు, కాల్పులు.. లూటీ చేసి చైన్ లాగి పరార్
బద్రినాథ్ ఉన్న చమోలి జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. ఈ సారి ఆరోగ్యపరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నందున యాత్రికుల మరణాల సంఖ్యను తగ్గించగలిగామని వివరించారు. కర్నప్రయాగ్, గౌచార్, జోషిమఠ్, పందుకేశ్వర్,గోవింద్ ఘాట్, పుల్నా, హేమకుండ్ సాహిబ్ వంటి చోట్ల హెల్త్ స్క్రీనింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ముందు జాగ్రత్తల కారణంగా చార్ ధామ్ యాత్రికుల మరణాలను నివారించగలిగినట్టు వివరించారు.