ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ పై మూడో సారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 

ముంబై : extortion caseలో మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌పై 8వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సింగ్‌పై జారీ చేసిన non-bailable warrant ఇది మూడోది. రాష్ట్రానికి సంబంధించిన ఓ రహస్య నివేదిక ప్రకారం సింగ్ చండీగఢ్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు.

గత నెలలో, థానే కోర్టుతో పాటు 37వ మెట్రోపాలిటన్ కోర్టు సింగ్, ఇతరులపై నమోదైన రెండు దోపిడీ కేసులకు సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. Param Bir Singh దేశం విడిచి పారిపోవచ్చని అనుమానిస్తూ రాష్ట్ర సిఐడి, థానే పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) కూడా జారీ చేశారు.

తాజా కేసులో సంజయ్ పునామియా, సునీల్ జైన్ అనే ఇద్దరు వ్యక్తులతో పాటు ఇద్దరు పోలీసు ఇన్‌స్పెక్టర్లు నందకుమార్ గోపాలే, ఆశా కోర్కెలను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు సార్లు సమన్లు ​​జారీ చేసినప్పటికీ, సింగ్ రాష్ట్ర సిఐడి ముందు హాజరుకావడం లేదా కేసుకు సంబంధించి వారికి సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో ఈ వారెంట్ ద్వారా సింగ్ పరారీలో ఉన్నాడని రుజువు చేయడం సులభమవుతుంది. 

రాష్ట్ర home ministerపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తూ chief ministerకి లేఖ రాసిన తర్వాత... ఆరోగ్య సమస్య కారణాలు చూపుతూ.. సింగ్ ఈ ఏడాది మేలో sick leaveపై వెళ్లారు. అప్పటి నుంచి డ్యూటీకి దూరంగా ఉన్నాడు.

రెండు నెలల తర్వాత, జులైలో మెరైన్ డ్రైవ్ పోలీసులు శ్యామ్ సుందర్ అగర్వాల్ అనే ఒక వ్యాపారి నుంచి రూ.20 కోట్లు దోపిడీకి ప్రయత్నించారనే ఆరోపణలపై సింగ్, డీసీపీ అక్బర్ పఠాన్, ఏసీపీ శ్రీకాంత్ షిండే, ఆరుగురు పోలీసులపై దోపిడీ, నమ్మక ద్రోహం, మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర కేసు నమోదు చేశారు. 

మీ వాళ్లనే మీరు నమ్మడం లేదా?: పరమ్‌బీర్ సింగ్‌కి సుప్రీం షాక్

gangster Chhota Shakeel తో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని అగర్వాల్‌పై ఫిబ్రవరి 2021లో పునామియా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జుహు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పుడు సింగ్ ముంబై పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని క్రైమ్ బ్రాంచ్‌ను కోరారు. అగర్వాల్ ఫిర్యాదు ప్రకారం, సింగ్ ఆదేశానుసారం అధికారులు, సెటిల్‌మెంట్‌కు రావాలని అతనిపై ఒత్తిడి తెచ్చారని, దాని కోసం రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఇంటెలిజెన్స్ నివేదిక సింగ్ దేశం విడిచి పారిపోయాడని వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. సింగ్ Chandigarhలోనే చాలా రోజులుగా ఉన్నాడని తెలిపింది. దీంతో సింగ్‌ను వెతకడానికి రాష్ట్ర సిఐడి, థానే పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నాలుగుసార్లు చండీగఢ్‌కు వెళ్లారు. కానీ వారు అతనిని కనిపెట్టలేకపోయారు. అతన్ని పట్టుకోవడానికి వెళ్లిన వీరికి స్థానిక పోలీసుల నుండి సహకారం అందలేదు. చండీగఢ్‌లో సింగ్‌కు చికిత్స చేసిన వైద్యుడిని తాము కలిశామని..పరమ్ బీర్ సింగ్ చంఢీగఢ్ లో ఉన్నట్లు ధృవీకరించిన పోలీసు అధికారులు తెలిపారు.