గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో సిక్స్ ఎంఎం పిస్తోలు ఎత్తుకెళ్లిన దొంగలు...
కర్ణాటకలోని గాలి జనార్థన్ రెడ్డి ఇంట్లో ఓ పిస్తోలు చోరీకి గురయ్యింది. సెక్యూరిటీ గార్డు దగ్గరున్న పిస్తోలును దొంగలు ఎత్తుకెళ్లారు.

బళ్లారి : బెంగళూరు నగరంలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో సిక్స్ ఎంఎం పిస్తోలు చోరీకి గురవడం కలకలం సృష్టించింది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర భద్రత ప్రైవేట్ సెక్యూరిటీ లైసెన్స్ కలిగిన ఈ పిస్తోలు పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రైవేటు సెక్యూరిటీ కూడా ఈ విషయం మీద చోరీకి గురైనట్లుగా బళ్లారి ఎస్పీకి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో బళ్లారి ఎస్పీ పిస్తోలు రికవరీకి ఒక ప్రత్యేక పోలీస్ టీంను రంగంలోకి దింపినట్లుగా పోలీసులు తెలిపారు.
బెంగళూరు నగరంలోని హవ్వంబావి ప్రాంతంలో గాలి జనార్దన్ రెడ్డి నివాసం ఉంది. ఈ నివాసానికి ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కాపలదారులుగా ఉంటున్నారు. ఇద్దరు సెక్యూరిటీ వ్యక్తుల్లో ఒకరి దగ్గరున్న లైసెన్స్డ్ పీస్తోలును అక్కడే పెట్టి బయటికి వెళ్లాడు. ఎవరో దీన్ని గుర్తించి అపహరించారు. తర్వాత ఈ విషయాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు వెంటనే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలి జనార్దన్ రెడ్డి ఇంటి పరిసరాలు, మెయిన్ గేట్ దగ్గర పరిశీలించారు.
మహిళలు పొట్టిబట్టలు వేసుకోవడం అశ్లీలత కాదు.. బాంబే హైకోర్టు
ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను కూడా పరిశీలించారు. ఆ ఫుటేజీలో సెక్యూరిటీ గార్డు పెట్టిన స్థలం నుంచి గన్నును ఎవరో ఒక వ్యక్తి తీసుకుపోతున్నట్లుగా కనిపించింది. ఇప్పుడు ఈ విషయం బెంగుళూరులో చర్చనీయాంశంగా మారింది. ఆపిస్తోలు ఎవరి చేతిలోకి చేరిందో, వారు ఎవరిని టార్గెట్ చేస్తారో అని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ పిస్తోలు చోరీ గురించి పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.