Asianet News TeluguAsianet News Telugu

అదానీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాలి.. దానికి జేపీసీ ఒక్కటే మార్గం - కాంగ్రెస్

అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ మరో సారి డిమాండ్ చేసింది. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు జరగాలంటే అదొక్కటే మార్గమని చెప్పింది. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పబోరని స్పష్టం చేసింది. 

There should be a thorough investigation into the Adani affair.. JPC is the only way for that - Congress.. ISR
Author
First Published Mar 22, 2023, 2:20 PM IST

అదానీ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు జరగాలంటే దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఒక్కటే మార్గమని కాంగ్రెస్ పేర్కొంది. అయితే  సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ ప్రభుత్వానికి ‘‘క్లీన్ చిట్’’ ప్యానెల్ అని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ బుధవారం మీడియాతో మాట్లాడారు. జేపీసీ డిమాండ్ ను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోందని, అందుకు ప్రతిగా యూకేలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ ను వెనక్కి తీసుకుంటామని చెబుతోందని ఆరోపించారు. అయితే క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, జేపీసీ డిమాండ్ లో రాజీపడేది లేదని ఆయన అన్నారు.

పోలీసులు అరెస్టు చేస్తారని అమృత్ పాల్ సింగ్ కు ముందే ఎలా తెలుసు ? - కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా

‘హమ్ అదానీ కే హై కౌన్' కార్యక్రమం కింద కాంగ్రెస్ పార్టీ అడిగిన మొత్తం ప్రశ్నలు 100 మార్కుకు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేశ్ మాట్లాడుతూ.. అదానీ ఇష్యూకు సంబంధించి ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీని 99 ప్రశ్నలు సంధించిందని తెలిపారు. ‘‘మీ వద్ద ఉన్న విస్తారమైన దర్యాప్తు సంస్థల సైన్యాన్ని ఉపయోగించి మీరు జాతీయ ప్రయోజనాల పని చేస్తారా ? లేదా ? అని చివరి ప్రశ్నతో ఈ సీరిస్ ను ముగిస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

‘‘ ప్రతిపక్షాలకు, పౌర సమాజానికి, స్వతంత్ర వ్యాపారులకు వ్యతిరేకంగా వాటిని ప్రయోగించడానికి మీరు ఎప్పుడూ వెనుకాడలేదు. 1947 నుంచి దేశం చూసిన అత్యంత నిస్సిగ్గు అవినీతి, ఆశ్రిత పక్షపాతం కేసును దర్యాప్తు చేయడానికి వాటిని ఉపయోగించాలని మేము ఇప్పుడు కొంత వ్యంగ్యంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము’’ అని రమేష్ ఆరోపించారు.

మార్చి 2న సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీకి దురదృష్టవశాత్తూ ఈ సంస్థలపై అధికారిక పరిధి లేదని ఆయన పేర్కొన్నారు. ‘అదానీ స్కామ్’ పై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు చేయాలని తాము ప్రార్థిస్తున్నామని, పైన పేర్కొన్న దర్యాప్తు సంస్థలపై దీనికి అధికార పరిధి లేదని అన్నారు. 

తండ్రి చివరి కోరికను నెరవేర్చిన కుమారుడు.. మృతదేహం ఎదుటే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు

భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు గతంలో స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ ప్రధాన కేసులను దర్యాప్తు చేయడానికి అంగీకరించాయని, కాబట్టి ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని సంబంధిత అంశాలను పరిశీలించడానికి జేపీసీ అవసరం అని  జైరాం రమేష్ నొక్కి చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios