Asianet News TeluguAsianet News Telugu

పోలీసులు అరెస్టు చేస్తారని అమృత్ పాల్ సింగ్ కు ముందే ఎలా తెలుసు ? - కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా

భారీ పోలీసు బందోబస్తు మధ్య రాడికల్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నారని కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ప్రశ్నించారు. అతడు తప్పించుకునేందుకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, కానీ అమాయక యువకులను ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. 

How did Amrit Pal Singh know in advance that the police would arrest him? - Congress Punjab Chief Amarinder singh raja warring.. ISR
Author
First Published Mar 22, 2023, 1:22 PM IST

రాడికల్ ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారు అమృత్పాల్ సింగ్ భారీ పోలీసు బందోబస్తు మధ్య తప్పించుకుని పారిపోయాడని, దీని వెనక ఏదో కుట్ర దాగి ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఆరోపించారు. అమృత్ పాల్ సింగ్ పంజాబ్ నుంచి పారిపోవడానికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే పోలీసులు అరెస్టు చేస్తారని అతడికి ఎలా తెలుసని ప్రశ్నించారు.

సహజీవనం బయటపెడుతాడేమో అనే భయంతో సోదరుడి హత్య.. ఎనిమిదేళ్ల తరువాత శరీర భాగాలు లభ్యం..

‘‘పోలీసు అధికారుల సమక్షంలో అమృత్ పాల్ ఎలా తప్పించుకున్నాడు? అంటే అమృత్ పాల్ కు ఈ పథకం గురించి తెలుసు. పంజాబ్, కేంద్ర ప్రభుత్వాల ఉద్దేశాన్ని నేను అనుమానిస్తున్నాను. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ పంజాబ్ లోని అమాయక యువకులపై చర్యలు తీసుకోకూడదు ’’ అని ఆయన అన్నారు. 

కాగా.. రాష్ట్రంలో ఇటీవల హింసాత్మక నిరసనలకు కారణమైన ఖలిస్థాన్ అనుకూల సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ పై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ), నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేశారు. అయితే అతడిని ఇంకా అరెస్టు చేయలేదని పంజాబ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ క్వార్టర్స్) సుఖ్ చైన్ సింగ్ గిల్ మీడియా సమావేశంలో చెప్పారు. 

తండ్రి చివరి కోరికను నెరవేర్చిన కుమారుడు.. మృతదేహం ఎదుటే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు

అతడిని అరెస్టు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే అది పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంజాబ్ పోలీసులకు ఇతర రాష్ట్రాలు, కేంద్ర సంస్థల నుంచి పూర్తి సహకారం లభిస్తోందని ఐజీపీ తెలిపారు. కాగా.. పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్ పై లుకౌట్ సర్క్యులర్ (ఎల్ వోసీ), నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్ బీడబ్ల్యూ) జారీ చేశామని, అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పంజాబ్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల విభాగం తెలిపింది. 

అమృత్ పాల్ సింగ్ ను అరెస్టు చేసే ప్రయత్నాల్లో భాగంగా పంజాబ్ పోలీసులు మంగళవారం అతని చిత్రాలను విడుదల చేశారు. ఇందులో అతడు వివిధ వేషధారణల్లో ఉన్న ఫొటోలు ఉన్నాయి. అయితే ఒక ఫోటోలో అమృత్ పాల్ సింగ్ క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు. ‘‘ ఈ చిత్రాలన్నీ విడుదల చేస్తున్నాం. ఈ కేసులో అతన్ని అరెస్టు చేయడానికి ప్రజలు మాకు సహాయం చేయాలి. వాటిని ప్రదర్శించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను’’ అని పంజాబ్ ఐజీపీ సుఖ్ చైన్ సింగ్ గిల్ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios