Asianet News TeluguAsianet News Telugu

తండ్రి చివరి కోరికను నెరవేర్చిన కుమారుడు.. మృతదేహం ఎదుటే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు

కుమారుడి పెళ్లి చూడాలన్న కోరిక తీరకుండానే ఆ తండ్రి చనిపోయాడు. దీంతో తండ్రి చివరి కోరికను నెరవేర్చాలనే ఉద్దేశంతో శవం ఎదుటే ప్రియురాలి మెడలో తాళి కట్టాడు ఆ యువకుడు. ఈ పరిణామం తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

The son who fulfilled his father's last wish.. In front of the dead body is a young man with a clapper around his girlfriend's neck.. ISR
Author
First Published Mar 22, 2023, 11:48 AM IST

పిల్లల పెళ్లిళ్లు కళ్లారా చూడాలని తల్లిదండ్రులు అందరూ చూడాలని అనుకుంటారు. కుమారుడు లేదా కూతురుకు తగిన జతను వెతికి, వారు వివాహ బంధంలోకి అడుగు పెడుతుంటే చూసి ఎంతో సంతోషిస్తారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలని కోరుకుంటారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కోరిక కూడా ఇదే. తన కుమారుడి పెళ్లి చూడాలని ఎంతో సంబరపడ్డారు. ఓ యువతితో అతడి పెళ్లి కూడా నిశ్చయించారు. కానీ మరి కొన్ని రోజుల్లో వివాహం ఉంది అనగా.. అతడు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో కుమారుడు ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఇప్పుడు అందరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే ? 

మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూత..

తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లా పెరువంగూరుకు చెందిన వి.రాజేంద్రన్ (65) సామాజిక కార్యకర్త. డీఎంకే క్రియాశీల సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే అతడు గత కొన్నేళ్లుగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అతడికి 29 ఏళ్ల ఆర్.ప్రవీణ్ అనే కుమారుడు ఉన్నాడు. తాను బతికి ఉన్నప్పుడే కుమారుడి పెళ్లి చూడాలని అనుకున్నాడు. దీంతో చెన్నై మేడవాక్కంకు చెందిన 23 ఏళ్ల సౌర్నమాల్యతో పెళ్లి నిశ్చయించారు. ఆమె ప్రవీణ్ పని చేసే ఆఫీసులోనే పని చేస్తూ ఉంటుంది. వారిద్దరూ ప్రేమికులు కూడా. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఒప్పుకోవడంతో మార్చి 27వ తేదీన కల్లకురిచ్చిలో వివాహం జరిపించాలని నిర్ఖయించారు. 

రూ.1.4 లక్షల ఫోన్ పోగొట్టుకున్న అమితాబ్ బచ్చన్ సహాయకుడు.. నిజాయితీగా పోలీసులకు అప్పగించిన రైల్వే కూలీ

ఇదిలా ఉండగా.. వి.రాజేంద్రన్ నెల రోజుల కిందట బాత్ రూమ్ లో జారిపడ్డాడు. దీంతో అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆదివారం రాత్రి ఆయనను హాస్పిటల్ లో చేర్పించగా.. అదే రోజు పరిస్థితి విషమించి మరణించాడు. అయితే ప్రవీణ్ తన తండ్రి చివరి కోరికను నెరవేర్చాలని అనుకున్నాడు. అంతిమ సంస్కారాల కు ముందు తండ్రి మృతదేహం ఎదుటే ప్రియురాలి మెడలో తాళి కట్టాడు. తరువాత తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. కొందరు గ్రామస్తులు, బంధువుల వ్యాఖ్యలను తాను పట్టించుకోనని, ఒక కొడుకుగా ఇది తన కర్తవ్యమని ప్రవీణ్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios