తమిళనాడుకు చెందిన 43 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తమ జలాల్లోకి వచ్చారన్న కారణంతో వారిని అరెస్టు చేసి, పడవలను స్వాధీనం చేసుకున్నారు. 

త‌మిళ‌నాడుకు చెందిన జాల‌ర్ల‌ను శ్రీలంక నేవి అదుపులోకి తీసుకుంది. సమ‌ద్రంలో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లిన జాల‌ర్లు పొర‌పాటున శ్రీలంక జ‌లాల్లోకి ప్ర‌వేశించ‌డంతో వారిని నేవి అధికారులు అరెస్టు చేశారు. ఈ మేర‌కు ఆ దేశ నేవీ ఆదివారం అధికారిక ప్ర‌క‌టించింది. ‘‘ డిసెంబర్ 18, 2021 రాత్రి శ్రీ‌లంక జాలాల్లో చేప‌లు వేటాడుతున్న 43 మంది భారతీయ జాల‌ర్ల‌ను జాఫ్నాలోని డెల్ఫ్ట్ ద్వీప ఆగ్నేయ సముద్రంలో ప్రాంతంలో స్పెష‌ల్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి అరెస్టు చేశాం. అలాగే 6 భారతీయ ఫిషింగ్ ట్రాలర్లను కూడా స్వాధీనం చేకున్నాం’’ అని శ్రీలంక నేవి పేర్కొంది. నార్తర్న్ నేవల్ కమాండ్‌కు అనుబంధంగా ఉన్న 04వ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఫ్లోటిల్లా (4 FAF) ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ల‌తో ఈ అరెస్టులు చేశాన‌మ‌ని చెప్పారు. పూర్తిగా కోవిడ్ -19 ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఈ ఆపరేషన్ నిర్వహించామ‌ని తెలిపారు. పట్టుబడిన భారతీయ జాల‌ర్ల‌కు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించిన తర్వాత చట్టపరమైన చర్యల కోసం ఇత‌ర అధికారుల‌కు వారిని అప్ప‌గిస్తామ‌ని, ఆ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయ‌ని నేవి ప్ర‌క‌టించింది. రెండు దేశాలకు చెందిన జాల‌ర్లు అనుకోకుండా ఒకరి జలాల్లోకి వ‌స్తున్నారు. ఈ కార‌ణంగా త‌రుచూ రెండు దేశాల‌కు చెందిన మ‌త్స్య‌కారులు అరెస్టుల‌కు గురవుతున్నారు.

స్వర్ణముఖి నదిలో నలుగురు గల్లంతు: ఒకరిని కాపాడిన స్థానికులు

ఈ విష‌యంలో త‌మిళ‌నాడుకు చెందిన అధికారులు స్పందించారు. తమ రాష్ఠ్రానికి చెందిన జాల‌ర్లు అరెస్టయిన విష‌యం వాస్త‌వ‌మే అని ధృవీక‌రించారు. త‌మ రాష్ట్రానికి చెందిన 500 మంది మత్స్యకారులు శ‌నివారం చేప‌ల వేట‌కు బ‌య‌లుదేరార‌ని చెప్పారు. శ్రీలంక జ‌లాల్లోకి వెళ్లిన 43 మందిని ఆ దేశ నేవీ అధికారులు అరెస్టు చేశార‌ని తెలిపారు. జ‌లార్ల అరెస్టు విష‌యంలో మ‌త్య్స‌కారుల సంఘం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. శ్రీ‌లంక నేవీ అధికారులు అరెస్టు చేసిన జాల‌ర్ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసింది. లేక‌పోతే రేప‌టి నుంచి ఆందోళ‌న‌లు చేస్తామ‌ని తెలిపింది. ఈ విష‌యాన్ని స్థానిక ఎంపీ కేన‌వ‌స్ క‌ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. త‌మిళ‌నాడు జాల‌ర్ల‌ను విడిపించేందుకు కృషి చేయాల‌ని కోరారు.