Asianet News TeluguAsianet News Telugu

కూలీ డబ్బులు ఇవ్వ‌లేద‌ని కోటి రూపాయిల మెర్సిడెస్ బెంజ్‌ను కాల్చిన కార్మికుడు..ఎక్క‌డంటే ?

ఇంట్లో రెండేళ్ల కిందట టైల్స్ బిగించినా.. ఇంకా డబ్బులు ఇవ్వడం లేదని ఆ కార్మికుడికి కోపం వచ్చింది. దీంతో ఇంటి బయట పార్క్ చేసి ఉన్న ఓనర్ కార్ ను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. 

The worker who burned the Mercedes-Benz worth crores of rupees for not being paid.
Author
First Published Sep 15, 2022, 12:05 PM IST

కూలీ డ‌బ్బులు ఇవ్వ‌కుండా స‌తాయిస్తున్నాడ‌ని కోపం తెచ్చుకున్న ఓ కార్మికుడు త‌న య‌జ‌మానికి చెందిన కోటి రూపాయిల విలువైన మెర్సిడెస్ బెంజ్‌ను త‌గుల‌బెట్టాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నోయిడా సిటీలో చోటు చేసుకుంది. ఇది స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

ల‌ఖింపూర్ ఖేరీ: ద‌ళిత అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, హ‌త్య కేసులో ఆరుగురి అరెస్టు

వివ‌రాలు ఇలా ఉన్నాయి. బీహార్ కు చెందిన రణ్ బీర్ నోయిడాలో ఉంటూ మెస్త్రీగా ప‌ని చేస్తుంటాడు. స‌ద‌ర్ పూర్ కాల‌నీలోని ఆయుష్ చౌహాన్ అనే వ్య‌క్తి ఇంట్లో 2020లో టైల్స్ బిగించాడు. అయితే ఆ ప‌నికి సంబంధించి ఇంకా రూ.2 ల‌క్ష‌లు ర‌ణ్ బీర్ కు పెండింగ్ లో ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఈ డ‌బ్బులు అడుగుతున్నా స‌రైన స్పంద‌న లేక‌పోవ‌డంతో అత‌డికి కోపం వ‌చ్చింది. దీంతో నిందితుడు కారు త‌గ‌లెబ్టాల‌ని అనుకున్నాడు. 

గాలి జనార్థన్ రెడ్డి కేసు విచారణ 12 యేళ్లుగా జాప్యమా? సీబీఐ కోర్టు పై మండిపడ్డ సుప్రీం..

సెప్టెంబర్ 11వ తేదీన ఆయుష్ తన మెర్సిడెస్ కారు ఇంటి బయట పార్క్ చేసి ఉంచాడు. ఈ స‌మ‌యంలో మేస్త్రీ బైక్ తీసుకొని వ‌చ్చి కారుకు కొంచెం ముందు వ‌చ్చాడు. ఆ ప్రాంతంలో ఎవ‌రూ లేర‌ని విషయాన్ని గ‌మ‌నించి త‌న వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ను తీసుకొని కారు వ‌ద్ద‌కు వెళ్లాడు. బాటిల్  మూత తీసి పెట్రోల్ ను కారుపై చల్లాడు. ఆ తర్వాత అగ్గిపెట్టెతో కారుకు నిప్పంటించాడు. దీంతో వెంట‌నే మంట‌లు అంటుకున్నాయి. వేగంగా అక్క‌డి నుంచి పారిపోయాడు. అయితే కొద్దిసేపటికే మంటలు ఆరిపోయాయి. ఈ ఘటన అంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 32 సెకన్ల వీడియోలో నిందితుడు మెర్సిడెస్ కారుకు నిప్పు పెట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. నిందితుడు హెల్మెట్ ధరించి ఉన్నాడు. నిందితుడు రణ్‌బీర్‌ బీహార్‌కు చెందినవాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం అతను గ్రేటర్ నోయిడాలోని రోజా జలాల్‌పూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఇప్పుడు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios