Asianet News TeluguAsianet News Telugu

ల‌ఖింపూర్ ఖేరీ: ద‌ళిత అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, హ‌త్య కేసులో ఆరుగురి అరెస్టు

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఇద్దరు దళిత సోదరీమణులపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిఘసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొరుగు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారిని అపహరించి చంపారని మృతుల కుటుంబ స‌భ్యులు ఆరోపించారు.
 

Uttar Pradesh: 6 arrested in Lakhimpur Kheri sisters death case
Author
First Published Sep 15, 2022, 11:37 AM IST

Lakhimpur Kheri: బుధవారం సాయంత్రం లఖింపూర్ ఖేరీ జిల్లా నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెట్టుకు ఉరివేసిన స్థితిలో వేలాడుతూ ద‌ళిత వర్గానికి చెందిన ఇద్దరు మైనర్ సోదరీమణులు మరణించిన కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ల‌ఖింపూర్ ఖేరీలోని లఖింపూర్ ఖేరీ జిల్లా నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెట్టుకు ఉరివేసిన స్థితిలో వేలాడుతూ ద‌ళిత వర్గానికి చెందిన ఇద్దరు మైనర్ సోదరీమణులు మరణించి క‌నిపించారు. పొరుగు గ్రామానికి చెందిన ముగ్గురు యువ‌కులు అక్కాచెల్లెళ్ల‌ను కిడ్నాప్ చేసి.. ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని మృతుల కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. కేసు న‌మోదుచేసుకునీ, విచార‌ణ జ‌రుపుతున్న క్ర‌మంలో.. వారిపై అత్యాచారం చేసి హ‌త్య చేసిన‌ట్టు గుర్తించిన‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో స్థానిక గ్రామస్థుడు ఛోటూ గౌతమ్‌తో పాటు ఐదుగురు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్పీ (లఖింపూర్ ఖేరీ) సంజీవ్ సుమన్ తెలిపారు. మరో ఐదుగురిని పొరుగున ఉన్న లాల్‌పూర్ గ్రామానికి చెందిన జునైద్, సోహైల్, హఫీజుల్ రెహ్మాన్, కరీముద్దీన్, ఆదిల్‌లుగా గుర్తించారు.

అరెస్టులు, ఈ క్ర‌మంలో చోటుచేసుకున్న సంఘటనల క్రమం గురించి మీడియాకు వివరించిన పోలీసు అధికారి.. సోహైల్, హఫీజుల్ రెహమాన్ బాలికలపై అత్యాచారం చేసి హత్య చేశారని, అయితే ఛోటూ ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాడని చెప్పారు. బాలికలకు జునైద్, సోహైల్‌తో ప్రేమ వ్యవహారం ఉందని పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు కరీముద్దీన్, ఆదిల్ మృతదేహాలను పారవేయడంలో మిగిలిన ముగ్గురికి సహాయం చేశారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రతీకార కాల్పుల్లో జునైద్ కుడి కాలుకు కాల్చినట్లు సమాచారం. కేసు న‌మోదుచేసుకున్నామనీ, దీనిపై విచార‌ణ జ‌రుతున్న‌ద‌ని తెలిపారు. 

కాగా, ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. యూపీలో "మహిళలపై క్రూరమైన నేరాలు పెరగడం" వెనుక కారణాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎత్తి చూపారు. "వార్తాపత్రికలు, టీవీలలో తప్పుడు ప్రకటనలు చేయ‌డం వ‌ల్ల శాంతిభద్రతలు మెరుగుప‌డ‌వ‌ని పేర్కొన్నారు. “లఖింపూర్ (యూపీ)లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల హత్య ఘటన హృదయ విదారకంగా ఉంది. ఆ అమ్మాయిలను పట్టపగలు కిడ్నాప్ చేశారని బంధువులు చెబుతున్నారు' అని హిందీలో ట్వీట్ చేసింది. “ప్రతిరోజు వార్తాపత్రికలు-టీవీలలో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం వల్ల శాంతిభద్రతలు మెరుగుపడవు. యూపీలో మహిళలపై క్రూరమైన నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి? అని ప్ర‌శ్నించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios