ఇది యుద్ధ యుగం కాదని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినప్పుడు ప్రపంచం మొత్తం విన్నదని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగించేందుకు భారత్ కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. 

భారత్‌కు నైతిక స్పష్టతతో మాట్లాడే సత్తా ఉందని, ఇది యుద్ధ యుగం కాదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినప్పుడు ప్రపంచం మొత్తం ఆలకించిందని అమెరికా తెలిపింది. రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ గురువారం మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ వివాదం ముగింపునకు తీసుకురావడంలో భారతదేశం ప్రత్యేకమైన పాత్ర పోషించాలని అన్నారు. “భారతదేశానికి ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఈ యుద్ధం, రష్యా దురాక్రమణను అంతం చేయడానికి వారితో కలిసి పని చేయాలని మేము ఆశిస్తున్నాము” అని ఆయన అన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్.. వ్యాపారవేత్త అమన్ దీప్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ..

పాశ్చాత్య దేశాలలో హిందువులపై జరుగుతున్న అన్ని రకాల హింస, తీవ్రవాదాన్ని కూడా నెడ్ ప్రైస్ ఖండించారు. “మతపరమైన బహువచనం మా ప్రధాన విలువ. భిన్నమైన దృక్పథంతో నిర్వహించే ఉద్యమాన్ని మేం ఖండిస్తున్నాము” అని ఆయన అన్నారు. కాగా.. ఉక్రెయిన్‌లో వివాదం మొదలైనప్పటి నుంచి ఈ సమస్యను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోగలమని భారత్‌ స్పష్టం చేసిందని ప్రధాని మోడీ గురువారం అన్నారు. ఎలాంటి శాంతి ప్రక్రియకైనా సహకరించేందుకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని కూడా ఆయన నొక్కి చెప్పారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఉక్రెయిన్‌లో వివాదాన్ని త్వరగా ముగించాలని ప్రధాని మోడీ కోరారు. ఆ సమయంలో ఇది యుద్ధం కాదని ఆయన పేర్కొన్నారు. ఉజ్బెకిస్థాన్‌లో వార్షిక ఎస్ సీవో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ సమావేశం జరిగింది.

విషాదం : చనిపోయిన తల్లి పక్కనే రెండో రోజులుగా పడుకుంటూ.. మూడు రోజులు గడిపిన 11యేళ్ల బాలుడు..

గత వారం కూడా నెడ్ ప్రైస్ భారతదేశాన్ని యూఎస్ ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణించారు. రెండు దేశాలు అనేక ముఖ్యమైన ఆసక్తులు, అనేక ముఖ్యమైన విలువలను పంచుకుంటున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘యుద్ధ యుగం కాదు’ వ్యాఖ్యలను గుర్తు చేసిన ఆయన, నిబంధనల ఆధారిత క్రమాన్ని సవాలు చేస్తున్న దేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘ఇది యుద్ధ యుగం కాదనే భారత ప్రభుత్వ నమ్మకాన్ని మీరు ప్రధాని మోడీ నుంచి బలంగా విన్నారు. నిబంధనల ఆధారిత క్రమాన్ని, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను, అంతర్జాతీయ చట్ట సూత్రాలను, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సూత్రాలను ప్రపంచ దేశాలు, ముఖ్యంగా రష్యా సవాలు చేస్తున్నాయి.’’ అని చెప్పారు. 

ఎల్పీజీ సిలిండ‌ర్ ధ‌ర‌ల పెంపుపై భ‌గ్గుమ‌న్న తెలంగాణ.. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళ‌న‌లు

యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడిని ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పించగలరా అని వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. యుద్ధాన్ని ఆపగలిగే ఏ ప్రయత్నాన్ని అయినా, భారత ప్రధాని చేపట్టడానికి సిద్ధంగా ఉన్న ఏ ప్రయత్నాన్ని అయినా స్వాగతిస్తామని అమెరికా తెలిపింది. ‘‘ప్రధాని మోడీ ఏ ప్రయత్నాలు చేసినా మేము ఇష్టపడుతాము. ఉక్రెయిన్‌లో శత్రుత్వానికి ముగింపు పలికే ఏ ప్రయత్నమైనా అమెరికా స్వాగతిస్తుంది’’అని తెలిపారు.