Asianet News TeluguAsianet News Telugu

20 ఏళ్ల కింద‌ట త‌ప్పిపోయిన మహిళ ఆచూకీ పాకిస్థాన్ లో ల‌భ్యం.. భార‌త్ కు తీసుకురావాల‌ని వేడుకోలు..

దుబాయ్ కు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏజెంట్ ఆ మహిళను పాకిస్థాన్ కు తీసుకెళ్లాడు. దీంతో ఆమె 20 ఏళ్ల నుంచి అక్కడే బతుకుతోంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఆమెను కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇంటికి రావడానికి సాయం చేయాలని అధికారులను కోరుతోంది. 

The whereabouts of the missing 20 years ago is available in Pakistan.. Request to bring it to India..
Author
New Delhi, First Published Aug 9, 2022, 9:56 AM IST

20 ఏళ్ల కింద‌ట త‌ప్పిపోయిన ఓ మ‌హిళ  ఆచూకీ పాకిస్థాన్ లో ల‌భ్యం అయ్యింది. ఆమె ముంబాయికి చెందిన మ‌హిళ‌గా తెలుస్తోంది. అయితే త‌న‌ను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం సాయం చేయాల‌ని ఆమె వేడుకుంటోంది. త‌న కుటుంబ స‌భ్యుల‌ను క‌ల‌వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతోంది. 

దారుణం.. రైలు ఎక్కిస్తాన‌ని న‌మ్మించి మైన‌ర్ పై అత్యాచారం.. ఇద్దరు అరెస్టు..

20 ఏళ్ల కింద‌ట ముంబాయికి చెందిన హమీదీ బేగం అదే ప‌ట్టణంలోని రిక్రూట్‌మెంట్ ఏజెంట్ మోసం చేశాడు. దుబాయ్ లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఆమెను పాకిస్థాన్ పంపించారు. అప్ప‌టి నుంచి ఆమె అక్క‌డే ఉంటోంది. అయితే ఆమెకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో కొంత కాలం ప్ర‌త్య‌క్ష‌మ‌య్యింది. తాను ముంబాయికి చెందిన మహిళ‌ను అను త‌న క‌థ‌ను వివ‌రించారు. ఇండియాకు వ‌చ్చేందుకు ప్ర‌భుత్వం సహాయం చేయాల‌ని ఆ వీడియోలో ఆమె కోరారు. ఆ వీడియో చూసిన ఆమె కుటుంబ స‌భ్యులు ఆమెకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఎంతో భావోద్వేగానికి గుర‌య్యారు. 

ఈ విష‌యంలో కరాచీలోని ఒక మసీదుకు ఇమామ్‌గా ఉన్న వలీవుల్లా మరూఫ్ మాట్లాడారు. ఆయ‌న బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్‌లోకి అక్రమ రవాణా ద్వారా చేర్చిన మ‌హిళ‌ను వారి కుటుంబాలకు ద‌గ్గ‌ర చేస్తుంటారు. ఆయ‌న దీని కోసం త‌న సోష‌ల్ మీడియా ఖాతాలను ఉప‌యోగిస్తుంటారు. హ‌మీదీ బేగం క‌థ‌ను కూడా ఇలాగే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఆమె త‌న కుటుంబ స‌భ్యుల‌ను గుర్తించ‌గ‌లిగింది. 

ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ అధికారులు తనను సంప్రదించారని మారూఫ్ చెప్పారు. ఆమెను తిరిగి ముంబైకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామ‌ని, హమీదీ బేగంను వారు కలవాలనుకుంటున్నారని చెప్పారు. హమీదీ లాంటి మహిళలు నిరక్షరాస్యులు, ఆర్థికంగా పేదలని అన్నారు. వారికి పాకిస్థాన్‌లో పని దొరకడం కష్టంగా మారిందని ఆయన అన్నారు.

వీడి దుంప తెగ.. రాజకీయనాయకుడికి కోపం వచ్చి 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేశాడు..

ఈ సంద‌ర్భంగా హ‌మీది మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా తన పిల్లలను, కుటుంబాన్ని చూడలేదని, వారిని కౌగిలించుకోవాలని ఉందని ​​భావోద్వేగంతో చెప్పింది. “ నేను నా కుమార్తె మరియు మనవరాలితో వీడియో కాల్‌లో మాట్లాడాను. కానీ నేను వారిని వ్యక్తిగతంగా కలవాలనుకుంటున్నాను. ఓ వ్య‌క్తి నాకు దుబాయ్ లో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని 2002లో ముంబైలోని రిక్రూటింగ్ ఏజెంట్ మోసం చేశారు. పాకిస్థాన్ లోని క‌రాచీకి అక్క‌డి నుంచి సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్క‌డ నేను మూడు నెలల జైలు శిక్ష అనుభవించాను.’’ అని ఆమె చెప్పారు.

Mahatma Gandhi Statue: నోయిడాలో వినూత్న ప్ర‌చారం.. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మహాత్ముడి విగ్రహం

మ‌రూఫ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఈ మహిళతో సమస్య ఉందని నాకు తెలుసు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటుంది. ఆమె తన కథను నాకు చెప్పింది. దీంతో ఆ క‌థ‌ను నేను వీడియో తీసి యూట్యూబ్ లో పోస్టు చేసి ఆమెకు సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అదృష్టవశాత్తూ ఖల్ఫాన్ షేక్ అనే భారతీయ జర్నలిస్ట్ ఆ వీడియోను చూసి న‌న్ను సంప్రదించారు.’’ అని ఆయన చెప్పారు. కాగా.. ఆ మహిళ తప్పిపోయిన సమయంలో ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. జైలు నుంచి విడుద‌లైన త‌రువాత ఓ వ్య‌క్తిని వివాహం చేసుకుంది. అత‌డు మూడు సంవ‌త్స‌రాల కింద‌ట మ‌ర‌ణించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios