Asianet News TeluguAsianet News Telugu

దళిత మహిళ నీళ్లు తాగిందని గోమూత్రంతో ట్యాంక్ శుభ్రం చేసిన అగ్రవర్ణాలు.. కేసు నమోదు చేసిన పోలీసులు

దళిత మహిళ నీళ్లు తాగిందని అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు వాటర్ ట్యాంకు నీటిని కాళీ చేశారు. అనంతరం దానిని గోమూత్రంతో శుభ్రం చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. 

 

The upper castes cleaned the tank with cow urine because the Dalit woman drank the water.. Police registered a case
Author
First Published Nov 21, 2022, 1:35 PM IST

దేశం అనేక రంగాల్లో ముందుకెళ్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఇంకా కుల, మత వివక్షలు చెదిరిపోవడం లేదు. చాలా విషయాల్లో మనుషులు సంకుచితంగానే వ్యవహరిస్తున్నారు. తనదే గొప్ప కులమంటూ ఇతర కులాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు కొందరు వ్యక్తులు. దేశంలో తరచుగా దళితులపై దాడులు వెలుగులోకి వస్తున్నాయి. వారిని అవమానాలకు గురి చేస్తున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఓ దళిత మహిళ నీళ్లు తాగిందని వాటర్ ట్యాంక్ ను గోమూత్రంతో శుభ్రం చేశారు. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఉద్ధవ్ ఠాక్రే టీమ్, కాంగ్రెస్‌కు మధ్య సయోద్య! భారత్ జోడో యాత్ర విశేష స్పందన అంటూ సంజయ్ రౌత్ ట్వీట్

వివరాలు ఇలా ఉన్నాయి. చామరాజనగర్ జిల్లా హెచ్‌డి కోటే తాలూకాలోని సర్గూర్‌ గ్రామంలోని దళిత కుటుంబంలో శుక్రవారం వివాహం జరిగింది. ఈ వేడుకులకు వధువు తరుఫున బంధువులు హాజరయ్యారు. అయితే ఆ వివాహ వేడుకల్లో విందు పూర్తయిన తరువాత ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఓ మహిళ  బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వాటర్ ట్యాంకులో నీళ్లు తాగింది. దీనిని ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గమనించాడు. తన అగ్రకులంలోని వ్యక్తులకు ఫోన్ చేశాడు. దీంతో వారంతా అక్కడికి చేరుకొని నీళ్లు తాగిన మహిళను దూషించారు. 

చావ్లా హత్యాచారం కేసు : నిర్దోషులుగా నిందితులు, సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ రివ్యూ పిటిషన్...

అనంతరం ఆ వాటర్ ట్యాంక్ కు ఉన్న నళ్లాలు అన్నీ తెరిచారు. అందులో ఉన్న నీరంతా బయటకు పంపించారు.  అనంతరం గోమూత్రం తీసుకొచ్చి దానిని శుభ్రం చేశారు. ఈ చర్యనంతా ఓ గ్రామస్తుడు వీడియో తీశాడు. దీనిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో గ్రామ అకౌంటెంట్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, ఇతర అధికారులు ఘటనా స్థలానికి శనివారం చేరుకున్నారు. ఎస్సీ యువకుల నుంచి ఫిర్యాదును స్వీకరించారు. విచారణ జరిపారు. నివేదికను తహసీల్దార్ కు అందించారు.

ఈ ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి వి సోమన్న నివేదిక కోరారు. ఇలాంటి ఘటనలు జరగడానికి అనుమతించబోమని మంత్రి అన్నారు. కాగా.. జిల్లా అధికారులు ఆదివారం ఆ గ్రామలో సమావేశం ఏర్పాటు చేశారు. స్థానికులతో మాట్లాడారు. ఈ సమావేశంలో దళిత సంఘాల సభ్యులు మాట్లాడుతూ.. తమను అగ్రవర్ణాలు ఆలయంలోకి రానివ్వకుండా నిరాకరిస్తున్నాయని ఆరోపించారు. అందరూ కలిసి కట్టుగా ఉండాలని, కుల మతాలకు అతీతంగా జీవించాలని గ్రామస్తులు అధికారులు కోరారు. దళితులను ఆలయంలోకి రానివ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios